నా భర్త మోసగాడు.. అందుకే చచ్చాడు: నటి నందిని | Tamil TV Actress open up on Husband's Suicide.

Mynaa nandini clarity on husband death

Television Actress Suicide, Nandini Mynaa, Nandini Mynaa Husband, Nandini Karthikeyan, Mynaa Nandhini, Karthikeyan Suicide, Actress Husband Suicide, Actress Nandini Karthikeyan, Serial Actress Husband Suicide

Tamil Television actress Nandini's husband Karthikeyan kills self, blames father-in-law. But, Wife has a different story to tell. That He was a cheater. TV actress 'Mynaa' Nandhini dated Karthik for a year before marrying him last year.

భర్త మరణంపై ‘మైనా’ నందిని క్లారిటీ

Posted: 04/05/2017 11:49 AM IST
Mynaa nandini clarity on husband death

తమిళ టెలివిజన్ నటి మైనా నందిని భర్త కార్తీకేయన్ చెన్నైలో సోమవారం సూసైడ్ చేసుకోవటం తెలిసిందే. వెరుగంబాక్కమ్ లోని ఓ లాడ్జీలో కూల్ డ్రింక్ లో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిమ్ ను నడుపుకునే కార్తీకేయన్ అతని మావయ్య వేధింపులు తట్టుకోలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ముందు మీడియా కథనాలు రాసింది.

అయితే తన భర్త మరణానికి తన తండ్రి కారణం కాదన్న నటి మైనా వెనుక చాలా కారణాలే ఉన్నాయని వివరించింది. నా భర్త కార్తికేయన్ చాలా మోసగాడని, ఎంతో మంది వద్ద డబ్బులు తీసుకుని, వారికి తిరిగివ్వకపోగా, వారంతా తనను కూడా చాలా ఇబ్బందులు పెట్టారని, నందిని క్లారిటీగా చెప్పేసింది. ఈ విషయమై భర్తను నిలదీస్తే సూసైడ్ చేసుకుంటానని తరచూ బెదిరించేవాడని తెలిపింది.

అంతేకాదు గతంలో ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న కార్తీకేయన్ ను, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయాక పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తోంది. మైనా సీరియల్ ద్వారా పాపులర్ అయిన నందిని, తర్వాత సినిమాల్లో కూడా నటించింది. ఏడాదిగా ప్రేమించుకున్న ఈ జంట గతేడాదే పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం కార్తీకేయన్ సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు
చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Serial Actress  Nandini Husband  Karthikeyan Suicide  

Other Articles