ఆ యూనిటీ మన టాలీవుడ్ లో లేదా? | Jallikattu protest Kollywood support.

Kollywood rallies behind jallikattu protesters

Jallikattu ban, Kollywood, Tamil Nadu Jallikattu protests, Tamil Nadu Jallikattu protest, Jallikattu ban star heroes, Kollywood Jallikattu, Jallikattu Marina beach, Marina Beach protest, Actors Jallikattu

Jallikattu ban: From Dhanush, Suriya to Vishal, Kollywood wants Tamil culture to stay intact.Jallikattu protest is a revolution: Kollywood actor Vishal

జల్లికట్టు ఉద్యమానికి కోలీవుడ్ అండ

Posted: 01/19/2017 04:36 PM IST
Kollywood rallies behind jallikattu protesters

జల్లికట్టు... తమిళనాడునే కాదు, దేశం మొత్తాన్ని ఇప్పుడు ఊపేస్తున్న ఒకే ఒక్క టాపిక్. తరతరాలుగా సాగుతూ వస్తున్న ఈ సాంప్రదాయ క్రీడను సుప్రీం కోర్టు బ్యాన్ చేయటం, ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి మద్ధతు లభించకపోవటం, ముఖ్యంగా తేనెతుట్టేను కదిపిన పెటా కు చుక్కలు చూపిస్తున్నారు అక్కడి జనాలు.

అయితే రాష్ట్రం అంతా అంతలా ఊగిపోతుంటే తాము కదలకపోతే ఎలా అనుకున్నారేమో! అందుకే ఒక్కసారిగా అంతా తమ గళం విప్పి మద్ధతు పలికారు. ఈరోజు కు కేవలం షూటింగ్ లు మాత్రమే ఆపేసుకున్న హీరోలంతా రేపు(జనవరి 20న) థియేటర్ల బంద్ కు పిలుపునిచ్చారు. అంతేకాదు తమ తమ సినిమా పనులను వాయిదా వేసుకుని జాయిన్ అయ్యారు. రాఘవ లారెన్స్ తన శివలింగ సినిమా ప్రెస్ మీట్ లను కాన్సిల్ చేసుకోవటమే కాదు, జల్లికట్టు కోసం ఏకంగా కోటి రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించి సంచలనంగా మారాడు. ఇక సూర్య తన సి-3(తెలుగులో సింగం-3) ప్రమోషన్ ను రద్దు చేసుకుని ఆందోళనలో పాల్గొంటున్నాడు. మరో నటుడు విక్రమ్ ప్రభు తన సత్రియన్ సినిమా ఆడియో వేడుకను కాన్సిల్ చేసేశాడు.

నడిగర్ సంఘం కూడా జల్లికట్టు ఉద్యమానికి పూర్తి మద్ధతునిస్తోంది. హీరో, కార్యదర్శి విశాల్ ప్రధాని ని కలిసేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా, రజనీకాంత్, కమల్ హాసన్ మొదలు విజయ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్ హీరోలు, శింబు, శివకార్తీకేయన్, విజయ్ సేతుపతి, జీవీ ప్రకాశ్ లాంటి కుర్రహీరోలు భాగస్వాములుగా మారారు. మొత్తానికి తమలో ఉన్న వైరమ్యాలను పక్కనబెట్టి తమిళ జాతి గౌరవం అంటూ టోటల్ కోలీవుడ్ అంతా ఒకేమాట మీదకు రావటం ఆసక్తికరంగా మారింది. కోడి పందాలను సినిమాల్లో చూపించే మన వాళ్లు(టాలీవుడ్) వాటి బ్యాన్ పై పన్నెత్తి మాట్లాడకపోవటం ఆశ్చర్యకరమే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Kollywood  support  

Other Articles