శాతకర్ణి తో అంతా కలిసిపోయారా? | Interesting tweets on balayya GPSK.

Celebs tweets on bala krishna satakarni movie

Tollywood celebrities, Gautamiputra Satakarni tweets, Satakarni Tweets, NTR satakarni tweets, Mega Heroes tweets on Satakarni

Tollywood celebrities tweets on Gautamiputra Satakarni.

బాలయ్య సినిమా కోసం వాళ్ల ట్వీట్లు

Posted: 01/12/2017 12:45 PM IST
Celebs tweets on bala krishna satakarni movie

నందమూరి అభిమానుల దాహం తీరుస్తూ థియేటర్లలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఇప్పటికే పాజిటివ్ టాక్ రావటంతో కలెక్షన్లు కుమ్ముకోవటం ఖాయమనే అనుకోవచ్చు. మనకు తెలియని ఓ చరిత్రను కళ్లకు కట్టేలా తెరకెక్కించాడని క్రిష్ పై అభినందనలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే సోషల్‌మీడియాలో శాతకర్ణి స్పెషల్ ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

నిన్న సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పటం దగ్గరి నుంచి ఈరోజు సినిమా సూపర్బ్ గా ఉందంటూ వస్తున్న ట్వీట్ల గురించి ఓ లుక్కేద్దాం. ముందుగా గత కొంతకాలంగా ఇద్దరి మధ్య పడటం లేదని చెప్పుకుంటున్న నాగ్ గురించి చూద్దాం. తనకి హిస్టారికల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ .. అందుకే గౌతమీపుత్ర శాతకర్ణి హిస్టరీ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నట్లు నాగ్ చెప్పారు. దర్శకుడు క్రిష్ తో పాటు టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో బాలయ్య-నాగ్ మధ్య మళ్లీ మాములు పరిస్థితి నెలకొంటుదని అభిమానులు అనుకుంటున్నారు.

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన బాబాయ్‌కి విష్ చెబుతూ అరగంట క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాబాయ్‌తో పాటు దర్శకుడు క్రిష్‌కు, సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు ఎన్టీఆర్. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా బాబాయ్‌కు అబ్బాయ్ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది. కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని ఈ ట్వీట్లతో అర్థమౌతోంది. 

 

 

ఇక బాలకృష్ణ సినిమాకు తెలుగు చిత్ర యువ హీరోలు తమ ట్వీట్లతో బ్రహ్మరథం పడుతున్నారు. హీరో మంచు మనోజ్ ఒక గంట క్రితం, మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ 40 నిమిషాల క్రితం చిత్రంపై స్పందించారు. "డేరింగ్ డాషింగ్ నటసింహ బాలయ్య అన్నకు, క్రిష్ బాబాయ్ కి థ్యాంక్స్. శరణమా... రణమా" అని మనోజ్ ట్వీట్ చేయగా, "జీపీఎస్కే గురించి గొప్పగా రిపోర్టులు వస్తున్నాయి. చిత్ర బృందానికి అభినందనలు. బాలయ్యా... మీరు మాలో చాలామందికి ఆదర్శం" అని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించాడు. మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పగా, రానా ఏకంగా తన పేరుకు తల్లి పేరును జత పరిచి క్రిష్ కు అభినందనలు తెలియజేశాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Satakarni Tweets  tollywood  celebrities  

Other Articles