దారితప్పిన జబర్ధస్త్ అమ్మడు.. చివరికి గూటికి rashmi gautam misses her way on attending a programme

Rashmi gautam misses her way on attending a programme

rashmi gautam, jabardast, Tv anchor, Tollywood actress, misses way, nandyal, karimnagar, programme

rashmi gautam a Tv anchor and Tollywood actress, majorly known as jabardast anchor had missed her way, she went to karimnagar instead of nandyala of kurnool district in AP.

దారితప్పిన జబర్ధస్త్ అమ్మడు.. చేరాల్సిన గూటికి బదులు

Posted: 12/19/2016 01:57 PM IST
Rashmi gautam misses her way on attending a programme

కుడి ఎడమైతే పోరబాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్.. అంటూ తెలుగు సినీ గీత రచయితలు అలపించిన పాట పలు సందర్భాలలో పలువురికి అచ్చంగా సరిపోతుంది. జబర్దస్త్' కార్యక్రమంతో ప్రజాదరణ పొందిన నటి, యాంకర్ రష్మీ విషయంలో కూడా ఇది సరిగ్గా సరిపోతుంది. ఎలాగంటారా.. నవ్యాంధ్రలోని ఓ ప్రాంతానికి వెళ్లాల్సిన అమ్ముడు ఏకంగా తెలంగాణలోకి వెళ్తిందట. అదేంటి రాష్ట్రాలు మారినా పోరబాటు లేదయ్ అంటూ రుయ్ రుయ్ అంటూ వెళ్లి.. ఏకంగా కరీంనగర్ చేరుకున్నాక కానీ తాను రావాల్సిన తెలంగాణలోకి కాదు.. ఆంధ్రలోకి అని తెలుసుకోలేకపోయిందట.

అసలు విషయంలోకి ఎంటైరైతే.. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు నుంచి కర్నూలు జిల్లా నంద్యాలకు రష్మీ కారులో బయలుదేరింది. అయితే, అమె కరెక్టుగా చెప్పిందో లేదో.. లేకపోతే కారు డ్రైవర్ సరిగా వినిపించుకున్నాడో తెలియదు కానీ.. అమె నంద్యాలకు బదులు ఏకంగా కరీంనగర్ కు చేరుకుంది. అదేంటి ఇంతసేపు ప్రయాణించినా.. నంద్యాలకు చేరుకోలేకపోయామని డ్రైవర్ తో అనగానే.. అప్పుడు డ్రైవర్ తాను కరీంనగర్ కు తీసుకువచ్చాననని చెప్పాడట.

దీంతో కొంత అసహనం వ్యక్తం చేసిన రష్మీ వెంటనే కారును నంద్యాల వైపు మళ్లించమని చెప్పింది. అయితే వర్క్ విషయంలో కొంత సిన్సియర్ గా వుంటే ఈ అమ్మడు కొంత ముందుగానే బయలుదేరటంతో.. కరీం నగర్ నుంచి నంద్యాలకు చేరుకున్నా.. అక్కడి ఇంకా తన కార్యక్రమం కొనసాగుతుందట. దీంతో తన కార్యక్రమంలో కొంత ఆలస్యంగా పాల్గోన్న రష్మీ.. వెంటనే అక్కడి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిందట. జరిగిన విషయం ఇదీ అని చెప్పింది. అనంతరం, అక్కడ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న రష్మీ డ్యాన్స్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rashmi gautam  jabardast  Tv anchor  Tollywood actress  misses way  nandyal  karimnagar  programme  

Other Articles