పీసీ హాలీవుడ్ ట్రైలర్ వచ్చింది. కానీ..| Baywatch trailer out but where is Priyanka Chopra?.

Pc makes a blin appearance in baywatch trailer

Priyanka Chopra Baywatch, Baywatch Official Trailer, Baywatch Trailer, Baywatch Priyanka Chopra, Priyanka Chopra Baywatch, Dwayne Johnson Baywatch, Dwayne Johnson Priyanka Chopra

Priyanka Chopra sizzles blink moment in 'Baywatch' trailer.

దీపిక ముందు ప్రియాంక ఓడిపోయిది

Posted: 12/09/2016 10:33 AM IST
Pc makes a blin appearance in baywatch trailer

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించిన ట్రిపుక్స్ సినిమా ట్రైలర్ ఇప్పటికే వచ్చేసింది. ఇక మిగిలింది ప్రియాంక చోప్రా సినిమా ట్రైలర్ మాత్రమే. క్వోంటికో సిరీస్ ద్వారా ఇప్పటికే హాలీవుడ్ లోపాగా వేసిన ప్రియాంక, డ్వేన్ జాన్సన్(రాక్) సినిమాలో కనిపించే అవకాశం కొట్టేసిన సంగతి తెలిసిందే.

90వ దశకంలో స్టార్ వరల్ట్ చానెల్ లో దుమ్మరేపిన బేవాచ్ సీరియల్ గుర్తుందా? బికినీ బేబ్స్ లైఫ్ గార్డులుగా మారిపోయి చేసిన రచ్చ అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు దానినే చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. రాక్ హీరోగా, జాక్ ఎఫ్రాన్, కెల్లీ రోహ్రబాక్, అలెజాండ్ర దాద్రిరియో వంటి హాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మన ప్రియాంక చోప్రా నెగటివ్ రోల్ లో కనిపించనుంది.

ఇక ఈ చిత్ర ట్రైలర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ముగ్గురు అమ్మాయిల లైఫ్ గార్డు బృందానికి చీఫ్ గా ఉండే రాక్ కి అసిస్టెంట్ గా మరో వ్యక్తిని నియమించడం, సముద్రంలో కొట్టుకు వచ్చే శవాల వెనుక ఉన్న మిస్టరీని ఆ గ్యాంగ్ చేధించటం అంతా ట్రైలర్ లో చూపించారు. అయితే ట్రైలర్ లోజస్ట్ ఒక్క సెకనే ప్రియాంక కనిపించినప్పటికీ, డీప్ క్లీవేజ్ షోతో కనువిందు చేసింది. అయితే ట్రిపుల్  ఎక్స్ లో దీపికను హైలెట్ చేస్తూ చూపించినప్పటికీ, ప్రియాంకను ఇలా రెప్పపాటులో చూపించేసరికి అభిమానులు నిరాశ చెందుతున్నారు.

 

ఇక కాకతాళీయంగానే అయినా ఇటు బాలీవుడ్‌లోను, అటు హాలీవుడ్‌లోనూ ప్రియాంక ఎంట్రీ మాత్రం విలన్‌గానే జరగటం విశేషం. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dwayne Johnson  Priyanka Chopra  Baywatch Trailer  

Other Articles