బ్రహ్మీ ఫ్రీ గా చేస్తానన్న తీసుకోలేదు | brahmi role in Jayammu Nischayammura

Just brahmi emojis enough for laughs

Srinivas Reddy, Brahmanandam Jayammu Nischayammura, Jayammu Nischayammura Brahmi Emojis, Brahmi Emojis comedy, Srinivas Reddy about Brahmi, Jayammu Nischayammura Brahmanandam, Brahmi Srinivas Reddy

Srinivas Reddy about Brahmanandam Emojis in Jayammu Nischayammura.

బ్రహ్మీ బొమ్మలను అలా వాడేసుకున్నారంట!

Posted: 12/03/2016 12:39 PM IST
Just brahmi emojis enough for laughs

కంటెంట్ ఉన్నోడి కటౌట్ ఉంటే చాలూ ఇది గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ ను ఉద్దేశించి బ్రహ్మీ చెప్పే డైలాగ్. కానీ, ఇప్పుడు అదే నిజమని ఈ స్టార్ కమెడియన్ నిరూపించాడు. ప్రస్తుతం చేతిలో పెద్ద సినిమాలు ఏం లేకపోయినా.. రెండు దశాబ్దాలుగా ఆయన పంచిన కామెడీని మాత్రం మనసారా ఆస్వాదించామన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిన నిజమే.

ఇక రీసెంట్ గా రిలీజ్ అయి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది శ్రీనివాస్ రెడ్డి నటించిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఈ సినిమాలో బ్రహ్మీ రియల్ గా యాక్ట్ చేయకపోయినా, ఇండైరెక్ట్ గా కామెడీని పండించేశాడు ఇందులో ఒక పాత్ర సందర్భానుసారంగా తన ఫీలింగ్స్ ఏంటో చెప్పడానికి బ్రహ్మానందం హవభావాల్ని వాడుకుంటుంది. బ్రహ్మి ఎక్స్ ప్రెషన్లకు ఇమోజీలు యాడ్ చేసి తన మొబైల్ ద్వారా వేరే వాళ్లకు మెసేజ్ లు పంపుతుంది. ఇలా దర్శకుడు శివరాజ్ కనుమూరి బ్రహ్మీ బొమ్మలతో వెరైటీగా వినోదం పంచాడు.

ఈ విషయంపై శ్రీనివాస్ రెడ్డి కూడా స్పందించాడు. ఐతే తన బొమ్మను పాత్రను ఇలా వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పని బ్రహ్మీ అవసరమైతే తానే ఫ్రీగా నటిస్తానని చెప్పాడంట. పోనీ సినిమా పూర్తయ్యాక ఆయనకు థ్యాంక్స్ కార్డు వేస్తామని డైరక్టర్, తాను కోరితే... ‘‘ఇది నా సినిమా.. అలాంటిదేమీ అక్కర్లేదని కూడా చెప్పాడంట. అదీ ఆయన గొప్ప మనసు’’ అంటూ శ్రీనివాసరెడ్డి వివరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivas Reddy  Brahmanandam  Jayammu Nischayammura  Emijis Comedy  

Other Articles