మూడురోజులకే నటి కాపురంలో చిచ్చు ? | Lisa Haydon husband's nationality question raised.

Lisa haydon clarifies her dad in law is not pakistani

Lisa Haydon clarifies her dad-in-law is not Pakistani, DNA article on Lisa Haydon, Lisa Haydon husband, Lisa husband not pakistani, Dino Lalvani not pakistani, Lisa Haydon marriage controversy

Lisa Haydon clarifies her dad-in-law is not Pakistani. And she married pure Indian.

నా మామ, భర్త పాకిస్థానీలు కారు-బాలీవుడ్ నటి

Posted: 11/03/2016 03:11 PM IST
Lisa haydon clarifies her dad in law is not pakistani

బాలీవుడ్ లో పాకిస్థాన్ నటులు పెట్టిన చిచ్చు మెల్లిగా సమసిపోతుందనుకుంటున్న సమయంలో మరో నటి వివాహం పెద్ద దుమారం రేపుతోంది. పాక్ సంతతికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందంటూ ఆమెపై విమర్శలు చెలరేగటమే కాదు, బ్యాన్ వేయాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి కూడా.

బాలీవుడ్ హీరోయిన్ లీసా హెడెన్ చైన్నైలో జన్మించింది. మోడల్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ ఫుల్-3, క్వీన్, శాంటా బాంటా, యే దిల్ హై ముష్కిల్ లాంటి సినిమాల్లో నటించింది. రీసెంట్ గా బాయ్ ఫ్రెండ్ డినో లల్వానీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బ్రిటన్ కు చెందిన ఈ బిజినెస్ మెన్ తో ఏడాది నుంచి డేటింగ్ చేసి చివరకు రింగులు మార్చేసుకున్నారు. అయితే లల్వానీ ఫ్యామిలీ ఇండియాది కాదని, వారి మూలాలు మొత్తం పాకిస్థానేనని, దాయాది మనిషిని పెళ్లి చేసుకున్న లీసా పెద్ద తప్పు చేసిందంటూ, బాలీవుడ్ బ్యాన్ విధించే అవకాశం ఉందని పేర్కొంటూ ఓ ప్రముఖ పత్రిక కథనం ప్రచురించింది.

అంతే దెబ్బకి సీరియస్ అయిన లీసా తన ట్విట్టర్ లో మండిపడింది. తమది క్రాస్ బార్డర్ పెళ్లి అని డిసైడ్ చేయటానికి మీరెవరంటూ పత్రికపై మండిపడింది. ఆమె భర్త పాకిస్థానీ అంటూ ఆమె వివాహంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన లిసా హేడన్... తన భర్త డినో పాకిస్థానీ కాదని ట్విట్టర్ ద్వారా తెలిపింది. తన మామయ్య గులు లల్వానీ అవిభాజ్య భారత్ లోని కరాచీలో పుట్టారని.... ఇండియా నుంచి పాక్ విడిపోయిన తర్వాత భారత్ కు వచ్చేశారని చెప్పింది. ప్రపంచమంతా ప్రేమనే కోరుకుంటుందని... ద్వేషాన్ని కాదంటూ తనపై విమర్శలు చేసినవారిపై అసహనం వ్యక్తం చేసింది.

 

ఓవరాల్ గా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా బతకాలనుకున్న బాలీవుడ్ హీరోయిన్ లిసా హేడన్ కు ఆ ఆనందం ఎంతో సేపు లేకుండా చేస్తోంది మీడియా అన్న వాదన వినిపిస్తోంది. లీసా వివరణ తర్వాత కూడా ఆ తిట్ల పురాణం ఆగట్లేదు. దీంతో సదరు మీడియాపై లీగల్ గా వెళ్లేందుకు లీసా సిద్దమైనట్లు కూడా తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lisa Haydon  Dino Lalvani  pakistani  marriage  

Other Articles