ఎస్ ఆర్ కే అంటే ఏంటి? హ..హా...హా... | Ajay Devagan laughs at Erika asked What Is SRK.

Srk insulted ajay devgn again

SRK insulted Ajay Devgn again, Ajay Devgn laughs at Shivaay actress question on Sharukh, SRK Ajay Devgan feud, SRK Ajay Devgan rift, Shivaay actress on SRK

Ajay Devgn laughs at Shivay actress Erika's question What Is SRK? in an interview.

షారూఖ్ కి సీనియర్ హీరో అవమానం?

Posted: 10/25/2016 11:21 AM IST
Srk insulted ajay devgn again

బాలీవుడ్ లో సీనియర్ల మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉన్నప్పటికీ సినిమాల విషయానికొచ్చే సరికి అంతా ఒకే తాటిపై నిలుస్తారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచే బాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న షారూఖ్-అజయ్ దేవగన్ మధ్య మాత్రం లోలోపల ఒక వార్ లాంటిదే జరుగుతుంది. షారూఖ్ కాస్త తగ్గి ఉన్నప్పటికీ అజయ్ మాత్రం సినిమాల రిలీజ్ విషయంలో మాత్రం గట్టి పట్టుతో ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇక తాజాగా శివాయ్ ఇంటర్వ్యూ సమయంలో  షారూఖ్ పై ఇలాంటి సెటైరే ఒకటి పడింది. ఎరికా కార్ అనే పోలీష్ నటి శివాయ్ లో అజయ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్లకి వచ్చేస్తుంది. అన్ని తానై చేసిన ఈ సినిమా కోసం అజయ్ ప్రమోషన్లు విపరీతంగా చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఎరికాతో కలిసి పాల్గొన్నాడు. అక్కడ యాంకర్ ఎరికాను ప్రశ్నిస్తూ... ఎస్ ఆర్ కే (షారూఖ్ షార్ట్ కట్ పేరు) సినిమాల్లో మీకు నచ్చింది ఏంటీ? అంటూ ప్రశ్నిస్తాడు. అంతే దానికి బదులుగా ఆమె వాట్ ఈజ్ ఎస్ ఆర్ కే అంటుంది. దానికి వెంటనే అజయ్ ముఖం పక్కకు తిప్పుకుని వెటకారంగా ఓ నవ్వు నవ్వుతాడు.

ఇక్కడ పోలాండ్ నుంచి వచ్చిన ఆ భామకు షారూఖ్ తెలియాలనే రూల్ ఏం లేదు అని కొందరు సమర్థించుకుంటుండగా, ఇంతకాలం ఓ ఇండియన్ సినిమాలో నటిస్తున్న ఆమెకు ఎస్ ఆర్ కే గురించి తెలీకపోవటం ఏంటని? అదంతా అజయ్ కావాలనే చేసిన జిమ్మిక్కు అని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి బద్ధ శత్రువపైన పడ్డ సెటైర్ కి అజయ్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Devgan laughs  Shivay actress Erika SRK  

Other Articles