సంపూ బాలీవుడ్ డెబ్యూ పూనంపాండేతో... | Sampoornesh Babu Bollywood debut with Poonam Pandey.

Sampoornesh in poonam pandey s next

Burning Star Sampoornesh Babu, Sampoornesh Babu guest role in Poonam Pandey’s Bilingual, Sampoo in Sexy Bomb Movie, Sampoo guest role in Poonam Pandey's Movie, Sampoornesh Babu ready for Bollywood Debut, Sampoo bollywood debut, Sampoo Poonam Pandey

Burning Star Sampoornesh Babu guest role in Poonam Pandey’s Bilingual.

బాప్ రే... సెక్సీ బాంబ్ సినిమాలో సంపూ

Posted: 10/22/2016 04:21 PM IST
Sampoornesh in poonam pandey s next

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కొబ్బరి మట్ట డిలే అయినప్పటికీ, తన అభిమానుల అంచనాలను అందుకునేలా మాత్రం ఉంటుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. సోలో హీరోగా ఓవైపు సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు చిన్న సినిమాల్లో కూడా గెస్ట్ రోల్స్ చేస్తూ సినిమా ఓపెనింగ్స్ వరకు మాత్రమే హైప్ తేగలుగుతున్నాడు. అందుకే చిన్న సినిమా దర్శకులు అలాంటి ప్రత్యేక పాత్రలను సంపూ కోసం డిజైన్ చేస్తున్నారు.

ఆ మధ్య కరెంట్ తీగలో సన్నీలియోన్ లవర్ గా తళుక్కున మెరిసిన బర్నింగ్ బాబూ ఇప్పుడు మరో సెక్స్ బాంబ్ సినిమాలో కనిపించేందుకు రెడీ అయ్యాడు. హాట్ షోలతో కవ్వించే పూనంపాండే ఈ మధ్యే ఓ తెలుగు సినిమా కోసం సైన్ చేసింది. అందులో సంపూర్ణేష్ బాబు ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగ తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూనంకి జోడీగానే సంపూ కనిపించే ఛాన్సులు దాదాపు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ముంబైకి షిప్ట్ కానుంది. భవానీ మస్తాన్ దర్శకత్వంలో తెలుగుతోపాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఆ రకంగా సంపూ బాలీవుడ్ డెబ్యూ కూడా చేస్తున్నాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh babu  Poonam Pandey’s Bilingual  

Other Articles