బాలీవుడ్ లో పీకూ, బాజీరావ్ మస్తానీ లాంటి రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో అవార్డులు సైతం కొల్లగొట్టిన సొట్టబుగ్గల దీపిక ఆపై హాలీవుడ్ కు చెక్కేసింది. ప్రస్తుతం విన్ డీజిల్ తో ట్రిపుల్ ఎక్స్ : ఎగ్జాండర్ కేజ్ డెబ్యూకి సిద్ధమైపోయిన దీపూ ఎప్పటికప్పుడు అందులోని లుక్ లతో చంపేస్తోంది. అయితే ఆ మధ్య రిలీజైన ట్రైలర్ లో ఆమెకు సంబంధించి కేవలం ఆరు ఫ్రేమ్ లను మాత్రమే చూపించారు. దీంతో అసలు ఇందులో కేవలం నామ మాత్రపు పాత్రేనని అంతా అనుకున్నారు.
కానీ, ఆ అంచనాలను పటాపంచల్ చేస్తూ మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది ట్రిపుల్ ఎక్స్ టీం. పూర్తిగా యాక్షన్ పార్ట్ తో నిండిపోయిన ఈ ట్రైలర్ లో ఇప్పటిదాకా వచ్చిన హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని రీతిలో రెచ్చిపోయింది. డీజిల్ తో రొమాన్స్ ట్రాక్ కూడా ఉన్నట్లు ఉంది గానీ, అదంతా సస్పెన్స్ గానే చూపించారు. రెండు మూడు డైలాగులను కూడా రివీల్ చేయటంతో సినిమాలో ఆమె లీడ్ అన్న విషయాన్ని ధృవీకరించినట్లయ్యింది.
అయితే సినిమాలో కేవలం ఇండియా వర్షన్ కోసమే దీనిని రిలీజ్ చేయటం, మరికొందరు స్టార్ హీరోయిన్లు ఉండటంతో పీకూయే లీడ్ కాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటిదాకా చూపించినదానికంటే, హాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కిందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరి సెరీనా ఉంగర్ రోల్ లో దీపికకు అంత సీన్ ఉందో లేదో తెలియాలంటే జనవరి దాకా ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more