బిచ్చగాడి ఇమేజ్ క్యాష్ చేసుకుంటారా? | Ann Maria Kalippilaanu becomes Pilla Rakshasi in Telugu

Bichagadu producers wants to cash another hit movie

Bichagadu producers wants to cash another hit movie, Bichagadu producers another movie, Pilla Rakshasi telugu movie, Pilla Rakshasi original movie, Ann Maria Kalippilaanu telugu dub

Bichagadu producers wants to cash another hit movie. Ann Maria Kalippilaanu becomes Pilla Rakshasi in Telugu.

బిచ్చగాడినే నమ్ముకుంటున్న మరో సినిమా

Posted: 09/26/2016 04:36 PM IST
Bichagadu producers wants to cash another hit movie

ఒరిజినల్ వర్షన్ పిచ్చైకారన్ కంటే డబ్బింగ్ చిత్రంగా బిచ్చగాడు సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. 30 లక్షలకు హక్కులు కొని రీలిజ్ చేస్తే దాదాపుగా పాతిక కోట్ల దాకా వసూలు చేయడమే కాదు, ఏకంగా వందరోజులు ఆడిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇదే ఊపుతో తన నెక్స్ట్ చిత్రం భేతాళుడిని విడుదల చేయబోతున్నాడు విజయ్ ఆంటోనీ.

అయితే ఇప్పుడు ఈ బిచ్చగాడినే నమ్ముకుని తెలుగులో మరో సినిమా రిలీజ్ కాబోతుంది. బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన చదలవాడ బ్రదర్స్ ఇప్పుడు మరో హిట్ మూవీ డబ్బింగ్ వర్షన్ ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. మళయాళంలో రీసెంట్ గా వచ్చిన అన్ మరియా కలిప్పిలాను అనే చిత్రం చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ఈ బ్రదర్స్ సిద్ధమైపోతున్నారు.   

సారా అర్జున్ అనే చిన్నారి ప్రధాన పాత్రలో సన్నీ వాయినే, అజూ వాగర్షి, సిద్ధిఖీ తారాగణంతో మిథున్ మాన్యుయెల్ డైరక్షన్ లో తెరకెక్కిందీ చిత్రం. ఓ గడసరి చిన్నారి అల్లరి కారణంగా ముగ్గురు యువకుల జీవితంలో అనుకోని పరిణామాలు జరుగుతాయి. చివరికి ఆ పాప కారణంగానే మళ్లీ వాళ్ల లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో పిల్ల రాక్షసి అనే టైటిల్ దీపావళికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నట్లు మమ్ముటి తనయుడు దుల్కర్ సల్మాన్(ఓకే బంగారం హీరో) ఇందులో ఓ అతిథి పాత్రలో మెరిశాడు. బిచ్చగాడు నిర్మాతల నుంచి రాబోతున్న మరో చిత్రం అంటూ అల్రెడీ పోస్టర్లు రిలీజ్ చేసేసుకున్నారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bichagadu Producers  Chadalavada Brothers  Ann Maria Kalippilaanu  Pilla Rakshasi  

Other Articles