శృతీహాసన్ రణ్ బీర్ ష్.. గప్ చుప్ | ranbir kapoor new girl friend shruthi hassan

Shruthi hassan interact with fans in fb

shruthi hassan interact with fans in FB, Shruthi says she is not femanist, shruthi hassan Ranbir Kapoor love story, shruthi hassan interact with fans, ahruthi hassan about religion, Shruthi Hassan Facebook Chating, Ranbir Kappor new girlfriend, Shruthi Hassan New Boyfriend

శృతీహాసన్ రణ్ బీర్ ష్.. గప్ చుప్ | ranbir kapoor new girl friend shruthi hassan

శృతీహాసన్ లో ఎంత మార్పు !

Posted: 09/24/2016 02:48 PM IST
Shruthi hassan interact with fans in fb

గ్లామర్ డాల్ శృతీహాసన్ గతంలో ఎప్పుడూ లేనివిధంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఈ మధ్య పేస్ బుక్ లో చాటింగ్ లతో గడిపేస్తోంది. తాజాగా కొందరు ఫ్యాన్స్ అడిగిన తుంటరి ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలిస్తోంది.

ముఖ్యంగా ఫెమినిజం గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రిప్లై ఇస్తూ... నేను ఫెమనిస్ట్ ను కాదు. మేము చాలా గొప్ప. ఇంతకంటే లోతుగా వెళ్లటం ఇష్టం లేదు అంటూ ఆపేసింది. ఇక మీరు హిందువా, ముస్లిమా (కమల్, సారికా మతాల గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ...) అని ఓ ఫ్యాన్ అడిగితే.. నేను ఓ ఇండియన్ ని అని సూటిగా చెప్పేసింది. నాకు అందరూ సమానమే, అందరినీ పూజిస్తా, మీరు అడిగింది గౌరవప్రదమైన ప్రశ్న కాదేమో అంటూ ఆన్సర్ ఇచ్చింది.

మాములుగా ఎప్పుడూ చిరాకు, అసహనంతో ఉండే శృతిలో ఇంత కూల్ నెస్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని పలువురు చెబుతున్నారు. అన్నట్లు శృతీపై వినిపిస్తున్న మరో పుకారు ఏంటంటే... రణ్ బీర్ కపూర్ తో ఏకంగా ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు బాలీవుడ్ లో సంచలనంగా మారాయి. ముంబైకి చెందిన కొన్ని పత్రికలు ఆయే దిల్ హై ముష్కిల్ షూటింగ్ స్పాట్ కి కూడా శృతీ హాజరైందన్న వార్తలతో కథనాలు ప్రచురించింది. రణ్ వీర్ కోసం టైం స్పెండ్ చేసేందుకే ఎక్కువగా సినిమాలు ఒప్పుకోవట్లేదా అన్న అనుమానాలు మొదలవుతున్నాయి. మరి ఈ విషయంపై స్పష్టత ఇచ్చేది ఎవరో?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Shruthi Hassan  Face Book Chat  Affair  Ranbir Kapoor  

Other Articles