పవన్ ద్వారా డబ్బులు లాగాలని చూస్తోంది | Samantha Ruth Prabhu to raise money for a good cause

Samantha ruth prabhu to raise money for a good cause

Samantha's NGO to raise funds, Samantha with Gabbar Singh Costumes, Samanatha Foundation, Samantha's NGO to raise funds, samatha Costumes auction

Samantha's NGO to raise funds by auctioning items used by actors.

సమంత మళ్లీ అదే పని చేస్తోంది

Posted: 09/19/2016 06:55 PM IST
Samantha ruth prabhu to raise money for a good cause

సమంతకు తన కెరీర్ విషయంలో కాస్త వెనక్కి తగ్గినప్పటికీ, ఇంకో విషయంలో మాత్రం అస్సలు వెనక్కి తగ్గటం లేదు. వరుస సినిమాలతో ఉన్నప్పుడే కాస్త గ్యాప్ దొరికినా సేవా కార్యక్రమాలపై పడిపోయినా కొనసాగించేంది. మరిప్పుడు ఖాళీగా ఉంటే ఊరుకుంటుందా చెప్పండి? ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎవరైతే అనారోగ్యం బారిన పడి, వైద్యం చేయించుకోలేని దుస్థితిలో ఉంటారో వారికి సమంత వెన్నంటి నిలుస్తోంది. తన స్వచ్ఛంద సంస్థ ‘ప్రత్యూష’ ద్వారా పలువురికి చేయూత నిస్తోంది.

ఈ నేపథ్యంలో ‘ప్రత్యూష’ కు నిధులు పెంచుకునే పనిలో పడింది. ఇందుకుగాను, పలువురు ప్రముఖ నటులు నటించిన చిత్రాల్లో వారు ఉపయోగించిన వస్తువులకు వేలం పాట నిర్వహించనుంది. ఈ విషయాన్ని సమంత తన ట్విట్టర్ ఖాతా తెలిపింది. ఈ వేలం పాటకు సంబంధించిన వివరాలను త్వరలోనే వివరిస్తానని చెప్పింది. ఈ వేలం పాట ద్వారా తన సంస్థకు నిధులు సమకూరతాయి,

తమ అభిమాన నటులు వాడిన వస్తువులను సొంతం చేసుకున్నామన్న తృప్తి అభిమానులకు ఉంటుందనే విషయాన్ని ఈ ట్వీట్ల ద్వారా సమంత చెప్పింది. కాగా, ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కల్యాణ్ ధరించిన ఖాకీ డ్రెస్సు కూడా ఈ వేలం పాటలో ఉంటుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Prathyusha NGO  Gabbar Singh Costumes  

Other Articles