శరత్ కుమార్ కు కోలుకోలేని షాకిచ్చాడు | Sarathkumar loses Nadigar membership

Sarathkumar loses nadigar membership

sarathkumar and radharavi suspended, Sarathkumar loses Nadigar membership, sarathkumar Vishal, Vishal revenge on sarathkumar, sarathkumar radharavi

sarathkumar and radharavi suspended from nadigar sangam on allegations.

విశాల్ ప్రతీకారం మొదలుపెట్టాడా?

Posted: 09/13/2016 12:26 PM IST
Sarathkumar loses nadigar membership

కామ్ గా ఉన్న వ్యవహారాలను కదిలించి తన దాకా తెచ్చుకోవటం తమిళ నటుడు శరత్ కుమార్ కు అలవాటుగా మారిపోయింది. సౌత్ లో గతేడాది నడిగర్ సంఘ ఎన్నికల సందర్భంగా రాజుకున్న వేడి ఎంత సీన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. అక్రమాలను బయటికి తీయటంతోపాటు, అప్పటి దాకా అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్ వర్గం పై సంచలన ఆరోపణలు చేసి, ఆపై వారిని మట్టి కరిపించి తన టీంను దగ్గరుండి మరీ గెలిపించుకున్నాడు హీరో విశాల్. అయితే ఓడిపోయినా శరత్ కుమార్ బుద్ధిమారలేదు. ఏడాది గడుస్తున్నా కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు సృష్టించి విశాల్ అండ్ కో ను ఇబ్బంది పెట్టేందుకు శరత్ టీం చాలానే ప్రయత్నాలు చేసింది. అయినా వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కుంటున్నాడు విశాల్.
 
ఇదిలా ఉండగా, శరత్ కుమార్ కు అనుకోని షాక్ ఇచ్చాడు విశాల్. నడిగర్ సంఘం (దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం) నుంచి ఈ సీనియర్ నటుడిని సస్పెండ్ చేస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించారు. శరత్ తోపాటు మాజీ కార్యదర్శి రాధారవి, మాజీ కోశాధికారి వాగా చంద్రశేఖర్ లను సస్పెండ్ చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. నడిగర సంఘం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యనిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపిన కార్యవర్గ సభ్యులు, తాము నిర్వహించిన శోదాల్లో గత కార్యవర్గం చేసిన అవకతవకలు తమ దృష్టికి వచ్చాయని, దీంతో పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ప్రకటన విడుదల చేసింది. తనిఖీల్లో భాగంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఈ ముగ్గురి ప్రాధమిక సభ్యత్వాలను రద్దు చేసినట్టు తెలిపారు. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయని భావిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వీరి అవకతవకలపై కోర్టు తీర్పు అనంతరం చర్యలు ఉంటాయని వారు తెలిపారు.

కాగా, ఎన్నికల్లో ఓడిన తర్వాత విశాల్ జట్టు తనపై చేసిన ఆరోపణలు, అవినీతి నిందలు తన మనసుని తీవ్రంగా గాయపరిచాయని, తాను పరిశుద్ధుడిని మీడియా ముఖంగానే శరత్ కుమార్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా 15 ఏళ్లు నడిగర్‌ సంఘం లో కొనసాగిన శరత్ కుమార్ నడిగర్‌ సంఘం వ్యవహారంలో అక్రమాలకు పాల్పడటంతోపాటు, సంఘం భవనం కట్టకుండా ఆ సొమ్మును తన రాజకీయ పార్టీ కార్యకలాపాల కోసం వాడుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం నడిగర్ నుంచి శాశ్వత బహిష్కరణతోపాటు, జైలు శిక్ష కూడా తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sarathkumar  radharavi  Nadigar Sangam  membership  suspend  

Other Articles