భోగికి చిరు ఖైదీ నంబర్ 150 రిలీజ్ | chiru khaidi no 150 release on bhogi 2017

Chiru khaidi no 150 release date announced

chiru khaidi no 150 release date, Vinayak announced Khaidi no 150 release date, chiru khaidi no 150 updates, chiru khaidi no 150 shooting, chiru khaidi no 150 release date fix

chiru khaidi no 150 release date announced. Vinayak says the movie will hit screen on Bhogi 2017.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

Posted: 09/08/2016 09:55 AM IST
Chiru khaidi no 150 release date announced

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ‘బాస్ ఈజ్ బ్యాక్’ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటోంది. డిసెంబర్ కల్లా చిత్రాన్ని పూర్తి చేసి చిరును విడుదల చేయాలని వినాయక్ భావిస్తున్నాడు. ఇక వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తుండగా, రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశాడు దర్శకుడు వివి వినాయక్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది భోగి రోజున విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశాడు.

బుధవారం రాజమహేంద్రవరం ఓ కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భోగి’ రోజున విడుదలయ్యే ఈ చిత్రం కేవలం అభిమానులనే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని వినాయక్ చెప్పారు. కాగా, ప్రస్తుతం మూవీ మొత్తానికి హైలైట్ గా నిలిచే కాయిన్ ఫైట్ ను వినాయక్ చిరుపై తీస్తున్నాడని తెలుస్తోంది. మాతృక తమిళ కత్తిలో ఈ సీన్ సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.  చిమ్మ చీకటి లో ఉండబోయే ఈ ఫైట్ లో చిరు కేకలు పుట్టించబోతున్నాడంట.

రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయిక కాగా, కేథరిన్ ఐటెం సాంగ్ లో అలరించనుంది. దేవీశ్రీ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సౌత్ టాప్ టెక్నిషియన్స్ పని చేస్తుండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  150 movie  Khaidi no 150  release date  

Other Articles