పవన్ డాలీ చిత్రం టైటిల్ మారిందా? | Pawan dolly movie title as Katama Rayuda

Pawan dolly movie title as katama rayuda

Pawan dolly movie title, kadapa king turns Katama Rayudu, Pawan as Katama Rayudu, Katama Rayudu Pawan, Pawan kalyan Katama Rayudu, Pawan movie title, popular song for pawan movi

Pawan dolly movie title change again fix as Katama Rayudu, waiting for official announcement.

కాటమరాయుడు కూడా డౌటేనా?

Posted: 08/30/2016 12:58 PM IST
Pawan dolly movie title as katama rayuda

డాలీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తేలిసిందే. అయితే రాజకీయాల్లో బిజీ అవుతున్న పవన్ ఈ సినిమాను త్వరగతిన పూర్తి చేయగలుగుతాడా? అన్న సందేహాల నడుమ. రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే దిశగా ఫ్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.

ఓవైపు జనసేన తరపున సభల్లో పాల్గొంటూనే, ఇంకోవైపు ఈ సినిమా షూటింగులో పాల్గొనే దిశగా షెడ్యూల్ మార్చమని సన్నిహితుడు, నిర్మాత శరత్ మరార్ కు అల్రెడీ సూచించాడంట. ఇక ఫాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కడప కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఇది వరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ మారనుందని, 'కాటమరాయుడు' పేరును పరిశీలిస్తున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. అత్తారింటికి దారేదిలో కాటమరాయుడా పేరుతో పవన్ పాట పాడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టైటిల్ అయితే క్రేజ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారంట.

అయితే కమెడియన్ సప్తగిరి హీరోగా కాటమరాయుడు అనే ఓ చిత్రం రాబోతుందని ఆ మధ్య ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్తలో ఎటువంటి క్లారిటీ లేదు. అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Kadapa King  Katama Rayudu  Dolly movie  

Other Articles