దర్శకుడు విక్రమ్ కుమార్ పెళ్లికి డేట్ ఫిక్స్ | Director Vikram Kumar marriage with Srinidhi

Director vikram kumar marriage date fixed

Director Vikram Kumar marriage, Vikram Kumar wife Srinidhi, Srinidhi Vikram Kumar, Director Vikram Kumar Wife, Vikram Kumar marriage date, sound engineer Srinidhi

Director Vikram Kumar ties the knot with Srinidhi on september 4th.

దర్శకుడు విక్రమ్ కుమార్ పెళ్లికి డేట్ ఫిక్స్

Posted: 08/27/2016 01:55 PM IST
Director vikram kumar marriage date fixed

డిఫరెంట్ కాన్సెప్ట్ ల చిత్రాలతో పేరు సంపాదించుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సెప్టెంబర్ 4 న చెన్నైలోని హిల్టన్ హోటల్ లో ప్రముఖ సౌండ్ డిజైనర్ శ్రీనిధిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అదే రోజు సాయంత్రం సెలబ్రిటీల సమక్షంలో గ్రాండ్ రిసెప్షన్ జరగనుందట.

మాధవన్ 13 బి చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విక్రమ్ కుమార్ తర్వాత నితిన్ తో ఇష్క్, మనం, రీసెంట్ గా 24 తో టాప్ డైరక్టర్ గా ఎదిగాడు. ఇక  శ్రీనిధి విషయానికొస్తే ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ దగ్గర సౌండ్ డిజైనర్ గా పనిచేస్తోంది. అంతేకాదు 24 చిత్రానికి కూడా పని చేసింది. ఈ సినిమా సమయంలో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. జూన్ లో ఎంగేజ్ మెంట్ కాగా, ఇప్పుడు పెళ్లి తేదీ ఖరారు చేసేశారు.

రిసెప్షన్ కి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తరపున నాగార్జున, సమంత, ఏఆర్ రెహమాన్, సూర్య, నిత్యామీనన్, శ్రీయా సరన్, మాధవన్ లతో పాటు ఇంకొందరికి ఇన్విటేషన్లు చేరాయంట.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director  Vikram Kumar  marriage  Srinidhi  date  fix  

Other Articles