సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ హాలీవుడ్ సినిమా కాపీనా? | Salman Khan’s Tubelight copied from Little boy

Salman khan s tubelight copied from little boy

Salman Khan’s Tubelight, Tubelight copy movie, Salman Tubelight Copy from Hollywood movie, Tubelight bollywood movie, Tubelight hindi movie, salman Tubelight story, Tubelight inspired from hollywood, Kabir Khan inspired Tubelight from Hollywood

Salman Khan’s Tubelight is a COPY of Hollywood film Little Boy

ట్యూబ్ లైట్ ఆ హాలీవుడ్ మూవీ కాపీ?

Posted: 08/22/2016 06:08 PM IST
Salman khan s tubelight copied from little boy

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అపజయమే ఎరుగని హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుసగా అన్ని వందకోట్ల సినిమాలే ఇస్తూ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాడు. ఇంకోవైపు కథల ఎంపిక విషయంలో, నటనలో కూడా వైవిధ్యతను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. తాజాగా ట్యూబ్ లైట్ తో వండర్స్ క్రియేట్ చేసేందుకు రాబోతున్నాడు.  

టైటిల్ దగ్గరి నుంచే ఈ సినిమాపై బాలీవుడ్ లో బాగా డిస్కషన్ జరుగుతోంది. ‘ఏక్ థా టైగర్’, ‘భజరంగీ భాయీ జాన్’ వంటి సూపర్ డూపర్ హిట్ అందించిన కబీర్ ఖాన్ దీనికి దర్శకుడు అవటం ఒక కారణం అయితే, చైనా నటి ఝూ ఝూ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించడం మరో ప్రత్యేకత. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త వినిపిస్తోంది.

ట్యూబ్ లైట్ ప్రధాన కథ లిటిల్ బాయ్ అనే హాలీవుడ్ చిత్రం నుంచి కాపీ కొట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తండ్రీకొడుకుల మధ్య జరిగే కథ ‘లిటిల్ బాయ్’. కాగా, కథలో స్వల్ప మార్పులు చేసి ఇద్దరు అన్నదమ్ముల మధ్య బంధంగా కబీర్ ఖాన్ ట్యూబ్ లైట్ ను వెలిగించబోతున్నాడంట. రియల్ అన్నదమ్ములు సల్మాన్, సొహైల్ ఖాన్ లు ఇందులోనూ అన్నదమ్ములుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Tubelight  Kabir Khan  Little Boy movie  Copy  

Other Articles