రుస్తుం అమీర్ ఖాన్ చేయాల్సిందా? | Aamir Khan was to make a film on Nanavati case

Aamir khan was to make a film on nanavati case

Aamir Khan Rustoum, Aamir Khan disappoint with Akshay Kumar, Aamir Khan Nanavati case, Amir Khan actual Rustoum

Aamir Khan was to make a film on Nanavati case, and dissappoint with Rustoum.

రుస్తుంను ఎవరి నుంచి లాక్కున్నాడంటే...

Posted: 08/22/2016 03:22 PM IST
Aamir khan was to make a film on nanavati case

నిజజీవిత చిత్రాలకు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో వరుసగా వస్తున్న బ్లాక్ బస్టర్లను బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా అందులో స్టార్ హీరోలు ఉంటే చాలూ దానికి మరింత హైప్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటుంది. అందుకే ఖాన్ త్రయం కూడా ఇప్పుడు బయోపిక్ లు దొరికితే చాలనుకుంటున్నారు.

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ రుస్తుం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. పోటీగా వచ్చిన మొహంజోదారో బొక్కబోర్లాపడటంతో మొదట యావరేజ్ టాక్ తో మొదలైన క్రమంగా రుస్తుం పుంజుకుంది. అయితే రుస్తుం సినిమా నిజానికి చేయాల్సింది అక్కీ కాదంట. బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అంట. ఈ విషయాన్ని చెబుతుంది ఎవరో కాదు నీర్జా దర్శకుడు రామ్ మాధవని.

అవును... కేఎం నానావతి కి సంబంధించిన కేసును అధ్యయనం చేయటమే కాదు, లండన్ లో ఉంటున్న ఆయన భార్య సైల్వియ దగ్గరి వెళ్లి మరీ అమీర్ పూర్తి వివరాలు సేకరించాడు. నీర్జా హిట్ అయిన తర్వాత అమీర్, నేను కలిసి ఈ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశాం. కానీ, ఇంతలో రుస్తుం గురించిన విషయం తెలిసేసరికి అమీర్ నీరుగారిపోయాడు అంటూ మాధవని చెప్పుకొచ్చాడు. అలా అమీర్ కంటే ముందే తెరకెక్కించి రుస్తుంతో హిట్ అందుకున్నాడు కిలాడీ హీరో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Nanavati Case  Akshay Kumar  Rustoum  

Other Articles