గౌతమీపుత్ర శాతకర్ణి డబ్బింగ్ ప్రారంభించిన బాలయ్య | balayya starting dubbing for Gautamiputra Satakarni

Balayya starting dubbing for gautamiputra satakarni

Balayya dubbing for GPS, GPS dubbing, Balayya no rest for GPS, Balayya 100th film, Balayya GPS

Bala Krishna started dubbing for Gautamiputra Satakarni.

బాలయ్య మాత్రం అస్సలు ఖాళీగా లేడు

Posted: 08/09/2016 03:32 PM IST
Balayya starting dubbing for gautamiputra satakarni

నటసింహ బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ కు దర్శకుడు క్రిష్ పెళ్లితో కాస్త అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అయితే మొరాకో, జార్జియాలోని ప్రధానమైన షెడ్యూల్స్ కంప్లీట్ కావటంతో మిగతా షెడ్యూలను శరవేగంగా పూర్తి చేసి అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తానని ప్రకటించాడు క్రిష్.

ప్రస్తుతం భార్యతో హనీమూన్ చెక్కేసిన క్రిష్ తిరగి వచ్చేదాకా ఈ షూటింగ్ మళ్లీ ప్రారంభం కాదు. అయితే ఈ లోగా ఖాళీగా ఉండకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోమ్మని టెక్నికల్ టీంకు సూచించాడంట. ఒక వైపున గ్రాఫిక్స్ వర్క్ జరుగుతూ ఉండగా, మరో వైపున డబ్బింగ్ పనులను కూడా ఆల్రెడీ ఆరంభించేశారు. హీరో బాలకృష్ణ ఆదివారం నుంచి తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. ఇంత వరకు షూటింగ్ జరుపుకున్న కీలక సన్నివేశాలన్నింటికీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేయనున్నారు.

సాధారణంగా చిత్రం షూటింగ్ లు ఆలస్యమయినా సరే మొత్తం టాకీ పార్ట్ పూర్తయ్యాకే హీరోలు డబ్బింగ్ చెప్పేవారు. కానీ, చారిత్రక నేపథ్యంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం, పైగా తన వందోది కావటంతో ఖాళీగా ఉండకుండా ఇలా డబ్బింగ్ కంప్లీట్ చేసేస్తున్నాడు బాలయ్య.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krish Marriage  bala krishna  dubbing  GPS  

Other Articles