నాని మణిరత్నం కల చెదరలేదు | sayami kher confirms Nani Maniratnam movie

Sayami kher confirms nani maniratnam movie

Sayami Kher Nani, Nani maniratnam movie confirm, Nani dream, Sayami Kher about Nani

Actress sayami kher confirms Nani Maniratnam movie by this year end.

నాని కల గురించి చౌదరిగారమ్మాయి

Posted: 07/23/2016 03:14 PM IST
Sayami kher confirms nani maniratnam movie

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా సరే స్వశక్తితో ఎదిగిన టాలెంటెడ్ నటుడు నాని అంటే దర్శకులందరికీ చాలా ఇష్టం. స్వతహాగా డైరక్షన్ డిపార్టెమెంట్ నుంచి రావటం మూలానో ఏమో వారంతా అతనితో పని చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కానీ, మణిరత్నం వీరాభిమాని అయిన నానికి ఆయన డైరక్షన్ లో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

అప్పట్లో కార్తీ , నాని, నిత్యామీనన్,  సయామీఖేర్ ప్రధానమైన పాత్రలుగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీనే ఫ్లాన్ చేశాడు మణిరత్నం. దాదాపుగా నటీనటుల ఎంపిక అయిన తర్వాత ఎందుకనో అది పట్టాలెక్కలేదు. ఆలోగా మణిరత్నం మరో కథను సిద్ధం చేసుకుని, కార్తీ కథానాయకుడిగా .. అదితిరావు కథానాయికగా ఆయన సెట్స్ పైకి వెళ్లారు. 'కాట్రు వెళదిలై' టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ నేపథ్యంలో, గతంలో మణిరత్నం అనుకున్న కథ ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఒక దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సయామీ ఖేర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గతంలో నేను నానితో ఓ చిత్రం చేయాల్సింది. కానీ, మిస్సయ్యింది. ఇప్పుడు మణిరత్నం సినిమాలో అదే ప్రాజెక్టు చేయబోతున్నాం అని చెప్పుకోచ్చింది. సయామీ సాయిధరమ్ తేజ్ రేజ్ చిత్రంతో టాలీవుడ్ లో చేసింది. ప్రస్తుతం మీర్జా చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Nani  Sayami Kher  Maniratnam Movie  

Other Articles