100 కోసం మహేష్, విజయ్? | mahesh and vijay for Sri Thenandal films high budget movie

Mahesh and vijay for sri thenandal films high budget movie

mahesh babu and Vijay high Budget movie, Sunder C direct Mahesh Babu, Kushboo Husband direct Mahesh Babu

Mahesh Babu and Vijay for Sri Thenandal films high budget movie under Sunder.C direction.

100 కోసం మహేష్, విజయ్?

Posted: 07/04/2016 03:39 PM IST
Mahesh and vijay for sri thenandal films high budget movie

ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తెరకెక్కాలంటే దానికి భారీ తారాగణం చేర్చటంతోపాటు, అందుకు సరిపడే బడ్జెట్ కూడా సమకూర్చుకోవటం నిర్మాతలకు కత్తి మీద సాము లాంటిదే. అలా అని ప్రతీది బాహుబలిలాగా భారీ లాభాలను తెచ్చి పెడుతుందన్న గ్యారెంటీ లేదు. ఏ మాత్రం తేడా వచ్చినా సరే దారుణమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. పులి, ఐ చిత్రాలే అందుకు నిదర్శనం. తాజాగా అలాంటి రిస్కీ ప్రాజెక్టు ఒకటి అనౌన్స్ కాబోతుంది.

శ్రీ తేనాన్ డాల్ అనే ప్రతిష్టాత్మక నిర్మాణ మరియు డిస్ట్రిబ్యూట్ సంస్థ తమ వందో చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రకళ, కళావతి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుందర్.సి అదేనండీ నటి కుష్బూ భర్త ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడని సమాచారం. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోయే ఈ చిత్రానికి స్టార్ల ఎంపిక కసరత్తు ప్రారంభిచినట్లు సమాచారం. తెలుగులో మహేశ్ బాబుతోను .. తమిళంలో విజయ్ తోను .. హిందీలో మరో హీరోతోను తెరకెక్కించాలన్న ఆలోచనలో ఉన్నారంట. ఈ విధంగా చేయడం వలన వసూళ్ల పరంగా ఏ ఢోకా ఉండదని భావిస్తున్నారంట.

అంతేకాదు రెహ్మన్, శిబు సిరిల్, కమల్ కణ్ణన్ వంటి హేమా హేమీలైన టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కథానాయకులను సంప్రదించే పనిలో వున్నారని అంటున్నారు. అయితే మురగదాస్ చిత్రం అయిపోగానే పూరితో సినిమా ఉంటుందని అల్రెడీ అనౌన్స్ చేశారు. అదే టైంలో  శ్రీ తేనాన్ డాల్ సంస్థకి గతంలో ఘనమైన చిత్రాలేం తీసిన చరిత్ర లేదు. మరి కేవలం బడ్జెట్ చూసి రెండేళ్లపాటు మహేష్ తన కాల్షీట్లను ఈ సినిమా కోసం కేటాయించే సీన్ ఉందంటారా?  

భాస్కర్
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Thenandal films  Sunder.C  100 Movie  kushboo husband  mahesh babu  Vijay  

Other Articles