యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్'లో నటిస్తోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో ఉంది. దీనికోసం స్పెషల్ గా ఫైటర్స్ ని ముంబాయి నుంచి తెప్పించి మరీ తెరకెక్కిస్తున్నారట. మోహన్ లాల్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత పాటలకోసం ఫారిన్ వెళ్లనుంది చిత్రయూనిట్. ఫారిన్ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమా ఆడియో రిలీజ్ చేస్తారు. ఈ సినిమాని ఆగష్టు 12వ తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, ఉన్నిముకుందన్, దేవయాని ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీస్ భారీగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
- మూర్తి
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more