బాహుబలి రైటర్ హ్యాండిల్ చేయగలడా? | vijayendra prasad to pen for Hindi mega serial

Vijayendra prasad to pen for hindi mega serial

Vijayendra Prasad for hindi serial, baahubali writer story for Hindi Epic Serial, హిందీ సీరియల్ కి రాజన్న తండ్రి కథ, బాహుబలి రైటర్ హిందీ సీరియల్ కి కథ, తాజా వార్తలు, సినిమా గాసిప్స్, సినిమా వార్తలు, తాజా వార్తలు, తెలుగు వార్తలు, రాజమౌళి తండ్రి హిందీ సీరియల్ కోసం, కే.వి. విజయేంద్రప్రసాద్ హిందీ కథ, సినిమా వార్తలు, latest news, movie gossips, serial story by vijayendraprasad

Vijayendra Prasad is now busy penning for hindi epic serial. It would be the biggest and most expensive television show of all times,on a par with the biggest costume dramas on the large screen.

బాహుబలి రైటర్ హ్యాండిల్ చేయగలడా?

Posted: 06/21/2016 06:31 PM IST
Vijayendra prasad to pen for hindi mega serial

తెలుగులో ఎన్నో హిట్ సినిమాలకు కథ అందించినప్పటికీ బాహుబలితో రాజమౌళి తండ్రి కే.వి. విజయేంద్రప్రసాద్ ప్రతిభను దేశం మొత్తం గుర్తించింది. ఒక మాములు కథను ఆసక్తికరంగా మల్చటం, దానిని తనయుడు రాజమౌళి ఎమోషనల్ చిత్రీకరించడం, ఇలా ఇద్దరు తండ్రీకొడుకులు ఒక దెబ్బకు పాపులర్ అయిపోయారు. ఆపై ఒక వారం తర్వాత వచ్చిన భజీరంగీ భాయిజాన్ ద్వారా ఒకే టైంలో రెండు ఆల్ టైం బ్లాక్ బస్టర్లకు కథ అందించే అవకాశం దక్కించుకున్నాడాయన.

విజయేంద్రప్రసాద్ లో మంచి రచయితే కాదు ఒక దర్శకుడు కూడా దాగున్నాడని రాజన్న సినిమా నిరూపించింది. ప్రస్తుతం ఓవైపు సినిమాలకు కథలు రెడీ చేస్తూనే మెగాఫోన్ తోనూ బిజీగా ఉన్నారాయన. అదే టైంలో ఈ స్టార్ రైటర్ హిందీ టీవీ సీరియల్స్ వైపు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అక్కడి సీరియల్స్ ఎంత భారీతనం సంతరించుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ బడ్జెట్, కాస్టింగ్ తో రూపుదిద్దుకుంటున్న వీటిపై సౌత్ లో ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వాటికొచ్చే టీఆర్పీ రేటింగ్ లోకల్ సీరియల్స్ కి పోటీగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.  

ఈ నేపథ్యంలో త్వరలో చారిత్రక నేపథ్యం ఉన్న ఒక భారీ సీరియల్ హిందీలో రూపుదిద్దుకోబోతుంది. దీనికి విజయేంద్రప్రసాదే కథను సిద్ధం చేస్తున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి నిర్మాణ సంస్థతో ఆయన కథా చర్చలు అల్రెడీ జరిగిపోయాయని చెబుతున్నారు. ఓ ప్రముఖ డైరక్టర్ దర్శకత్వం వహించిన బోతున్న ఈ సీరియల్స్ లో కొందరు టాప్ బాలీవుడ్ స్టార్లను ప్రధాన తారగణంగా నటింపజేయనున్నారంట. ఎపిక్ కథలను అందించడంలో దిట్ట అయిన విజయేంద్ర ప్రసాద్ తన కథతో అటు హిందీ ప్రేక్షకులను మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమైపోతున్నారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayendra Prasad  hindi serial  baahubali writer  rajamouli father  

Other Articles