ఐదుగురు డైరక్టర్లతో కొత్త ప్రయోగం | five directors for Chennai 600028 sequel climax

Five directors for chennai 600028 sequel climax

Chennai 600028 sequel, venkat prabhu Chennai 600028 sequel, five directors for Chennai 600028 sequel, Chennai 600028 సీక్వెల్ ఐదుగురు డైరక్టర్లు, five directors for one movie, entertainment, telugu news, latest news, తాజా వార్తలు, మూవీ వార్తలు, తెలుగు వార్తలు, కోలీవుడ్, దర్శకుడు వెంకట్ ప్రభు

five directors for Chennai 600028 sequel climax. venkat prabhu variety plan for Chennai 600028 climax.

ఐదుగురు డైరక్టర్లతో కొత్త ప్రయోగం

Posted: 06/18/2016 05:23 PM IST
Five directors for chennai 600028 sequel climax

కోలీవుడ్ లో కొత్త ప్రయోగానికి తెరతీయబోతుంది. ఒక సినిమా కోసం ఒకేసారి ఐదుగురు దర్శకులు పనిచేయబోతున్నారు. గోవా, గ్యాంబ్లర్, రాక్షసుడు వంటి ఢిపరెంట్ చిత్రాలను అందించిన దర్శకుడు వెంకట్ ప్రభు తన అప్ కమింగ్ చిత్రం కోసం ఈ వైరైటీ ఆలోచన చేస్తున్నాడు.

తన తొలిచిత్రం చెన్నై 600028 తోనే పెద్దహిట్ అందుకున్నాడు వెంకట్ ప్రభు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో తమిళనాట సెన్సెషన్ క్రియేట్ చేసింది. తెలుగులో ‘కొడితే కొట్టాలిరా’ పేరుతో విడుదలై ఇక్కడా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఇప్పుడు సీక్వెల్ ని తెరకెక్కించే ప్రయత్నంలో ఆయన బిజీగా ఉన్నాడు.

అయితే ఈ చిత్ర క్లైమాక్స్ కోసం ఐదుగురు డైరక్టర్లను వాడబోతున్నాడని తెలుస్తోంది. వెంకట్ స్నేహితులు, తన దగ్గర అసిస్టెంట్లుగా పని చేసిన వెంకటేష్ రామకృష్ణన్, శరవణ రాజన్, శ్రీపతి, చంద్రు, నాగ్రేందన్ ఆర్ లతో  ఈ ప్రయోగం చేయబోతున్నాడు. గత చిత్రంలో ఉన్న నటీనటులే ఇందులోనూ కనిపించబోతున్నట్లు ఆల్రెడీ వెంకట్ ప్రభు చెప్పేశాడు కూడా.

బాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai 600028 sequel  venkat prabhu  five directors  

Other Articles