వారెవ్వా... కేక పుట్టిస్తున్న బాలయ్య ఫస్ట్ లుక్ | Gautamiputra Satakarni First Look

Gautamiputra satakarni first look

Gautamiputra Satakarni First Look, Gautamiputra Satakarni Poster, Balakrishna First Look Poster, Balakrishna Gautamiputra Satakarni Poster, Gautamiputra Satakarni Latest stills, Gautamiputra Satakarni shooting updates, Gautamiputra Satakarni movie news, Balakrishna with Shriya saran, Shriya in Gautamiputra Satakarni, Shriya saran latest stills

Gautamiputra Satakarni First Look: Nandamuri Balakrishna Gautamiputra Satakarni first look poster released on balakrishna birthday special. directed by krish jagarlamudi and produced by Saibabu Jagarlamudi and Y. Rajeev Reddy under First First Frame Entertainment banner. Music composed by Devi Sri Prasad.

వారెవ్వా... కేక పుట్టిస్తున్న బాలయ్య ఫస్ట్ లుక్

Posted: 06/09/2016 04:35 PM IST
Gautamiputra satakarni first look

నందమూరి నటసింహం బాలకృష్ణ తన అభిమానులకు అదిరిపోయే బహుమతిని తన పుట్టినరోజు సంధర్భంగా అందించాడు. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు. బాలయ్య 100వ చిత్రంగా దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్పణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

రేపు(జూన్10) బాలయ్య పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్ర యూనిట్ ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో బాలయ్య లుక్ అదిరిపోయింది. బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్, తలపాగ, మొహంలో రాజసం అదిరిపోయింది. యుద్ధవీరుడిగా బాలయ్య లుక్ చాలా కొత్తగా వుంది. బాలయ్యకు సాటి ఎవరూ లేరయ్యా అనిపించే విధంగా అదిరిపోయింది. ఈ ఫస్ట్ లుక్ కు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీలో వున్నారు. మాములుగా ఈ సినిమా టైటిల్ లోగో మరియు టైటిల్ ను విడుదల చేసినప్పుడే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.

కానీ ఇపుడు బాలయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నాడు. ‘బాహుబలి’ని మించిన గ్రాఫిక్స్ వర్క్స్ తో ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’ని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. శ్రియ హీరోయిన్ గా నటించనుంది. అఖండ భారతావనిని పరిపాలించిన తొలి తెలుగు రాజైన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రమే బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణీ’.

ఈ చిత్రానికి ర‌చ‌నా స‌హ‌కారం - భూప‌తిరాజా; మాట‌లు - సాయిమాధ‌వ్ బుర్రా; పాట‌లు - సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి; ప్రొడ‌క్షన్ డిజైన‌ర్ - భూపేష్ ఆర్.భూప‌తి; స్టిల్స్ - జీవ‌న్ రెడ్డి; డి.ఓ.పి - జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్; ఫైట్స్ - రామ్,ల‌క్ష్మణ్; డాన్స్ - బృంద‌; ఎడిటింగ్ - సూర‌జ్; సంగీతం - దేవిశ్రీప్రసాద్; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - కొమ్మినేని వెంక‌టేశ్వర‌రావు; నిర్మాత‌లు - వై రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు; ర‌చ‌న - ద‌ర్శక‌త్వం - జాగ‌ర్లమూడి రాధాకృష్ణ (క్రిష్).

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  Gautamiputra Satakarni  Shriya Saran  Krish  

Other Articles