నితిన్ కు పవర్ స్టార్ డబుల్ బోనాంజా | Pawan Kalyan Sent Mangoes to Nithin

Pawan kalyan sent mangoes to nithin

Pawan Kalyan Sent Mangoes to Nithin, A Aa Film making videos, Censor Report, A Aa Video Songs, A Aa Movie trailers, A Aa Movie songs, A Aa Movie stills, A Aa Movie posters, A Aa Movie release date, A Aa Movie

Pawan Kalyan Sent Mangoes to Nithin: Director Trivikram upcoming film A Aa. Nithin, Samantha acts in lead roles. A Aa will be release on 2 july.

నితిన్ కు పవర్ స్టార్ డబుల్ బోనాంజా

Posted: 05/31/2016 08:54 AM IST
Pawan kalyan sent mangoes to nithin

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులలో హీరో నితిన్ కూడా ఒకరు. తన ప్రతి సినిమా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్థావన ఖచ్చితంగా వుంటుంది. అలాగే ఇటీవలే జరిగిన ‘అఆ’ ఆడియో విడుదల కార్యక్రమంలో నితిన్ తనకు తమ్ముడు లాంటి వాడని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వీరి అనుబంధం మరింత బలంగా మారింది.

అయితే ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ తన సన్నిహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు తన తోటలో పండిన మామిడి పండ్లను బహుమతిగా పంపిస్తూ వుంటాడు. తాజాగా నితిన్ కు పవన్ మామిడిపండ్లు పంపి శుభాకాంక్షలు తెలియజేసారు. నితిన్ నటించిన ‘అఆ’ సినిమా జూన్ 2వ తేదిన విడుదల కానుంది. ఈ సంధర్భంగా నితిన్ కు శుభాకాంక్షలు చెబుతూ మామిడి పండ్లను పంపించాడు పవన్.

తన సినిమా విడుదలవుతుందని తెలిసి, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడం, మామిడి పండ్లు పంపించడంతో నితిన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి డబుల్ బోనాంజాతో నితిన్ ఫుల్ ఖుషీలో వున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన ‘అఆ’ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ వుంది. మరి సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  A Aa Movie  Nithin  Samantha  Trivikram  Anupama Parameshwaran  

Other Articles