బుల్లితెర మెగాస్టార్ అసలు గుట్టు విప్పాడు | prabhakar reveals clashes between ramoji rao and suman

Prabhakar reveals clashes between ramoji rao and suman

TV anchor Prabhakar, Ramoji Rao and Suman, ETV serials, ఈటీవీ, ప్రభాకర్, సుమన్, రామోజీరావు, entertainment, latest news

TV anchor Prabhakar revealed that there had been personal differences between Ramoji Rao and his son Suman.

బుల్లితెర మెగాస్టార్ అసలు గుట్టు విప్పాడు

Posted: 05/28/2016 04:37 PM IST
Prabhakar reveals clashes between ramoji rao and suman

టెలివిజన్ యాంకర్ ప్రబాకర్. ఒకనోక టైంలో బుల్లితెర మెగాస్టార్ అనే ట్యాగ్ లైన్ తగిలించుకుని, సీరియల్స్, డాన్స్, రియాల్టీ షోల తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. తొలినాళ్లలో ఈటీవీ చానెళ్లలో ఈయనగారిదే హవా. ఈటీవీ సంస్థ అధిపతి రామోజీరావు తనయుడు సుమన్ తో ఉన్న స్నేహం కారణంగా అప్పుడు మనోడు ఆడిందే ఆట, పాడిందే పాట. అయితే తర్వాత జరిగిన కొన్ని గొడవలతో యాజమాన్యంతో తెగదెంపులు చేసుకోవటంతోపాటు చానెల్ నుంచి బయటికి వచ్చేశాడు. ఇక ప్రస్తుతానికి అతడి హవా పూర్తిగా తగ్గినట్లే అనుకోండి. అయితే అసలు ఆ టైంలో ఏం జరిగిందో, ఈటీవీ నుంచి ఎందుకు బయటికి వచ్చాడో, ఆ గొడవలు అసలు ఏంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

చానెల్ వ్యవహారంలో ప్రభాకర్ తీసుకున్న నిర్ణయాలు కొన్ని రామోజీ రావుకు నచ్చేవి కావంట. దీంతో స్నేహితుడైన సుమన్ తో ఈ విషయంపై చర్చించగా, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటానని ప్రభాకర్ కు హామీ ఇచ్చాడంట. ఈ విషయం ఆ నోట, ఈ నోట చేరి చివరికి రామోజీరావు చెవిన పడటం, తండ్రి కొడుకుల మద్య చిచ్చుపెడుతున్నాడని అపార్థం చేసుకున్న రామోజీరావు వెంటనే ప్రభాకర్ ను తొలగించేయడం జరిగిపోయాయి. అది తెలిసి సుమన్ కూడా స్నేహితుడి కోసం ఎండీ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారంట. అయితే బంధువలు నచ్చజెప్పటంతో తిరిగి తండ్రి దగ్గరికే చేరటం, కాన్సర్ బారిన పడి చనిపోవటం తెలిసిందే.  తాను బయటి వాడిని కాబట్టే ఈ గొడవలకు కారణమయ్యాయని భావించి తొలగించారని, ఇందులో పెద్దాయన తప్పేం లేదని ప్రభాకర్ తన వర్షన్ గా చెబుతున్నాడు. మరి అది అసలు మ్యాటర్ అవునా? కాదా? అంటే మాత్రం రామోజీరావు నోరు విప్పితేనే తెలిసేది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV anchor Prabhakar  ETV  Ramoji Rao  Suman  

Other Articles