రోడ్డుమీద అడుక్కున్న సింగర్ | Bollywood Singer becomes beggar

Bollywood singer becomes beggar

Sonu Nigam becomes beggar, Sonu Nigam begging, The Roadside Ustaad, Sonu Nigam videos, Sonu Nigam latest news, Sonu Nigam begger, Sonu Nigam at road side, Sonu Nigam stills, Sonu Nigam songs

Bollywood Singer becomes beggar: Bollywood popular singer Sonu Nigam becomes beggar for Being India program.

రోడ్డుమీద అడుక్కున్న సింగర్

Posted: 05/18/2016 03:28 PM IST
Bollywood singer becomes beggar

ఈమధ్య సినీ సెలబ్రెటీలు అందరూ కూడా ఏదో ఒక కార్యక్రమం పేరుతో జనాల ముందుకు వస్తున్నారు. కొంతమంది ఒరిజినల్ గెటప్ లలో వస్తుంటే.. మరికొందరేమో వేషాలు మార్చేసుకొని, కొత్త గెటప్ లలో జనాల ముందుకు వెళ్లి హడావిడి చేసేస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా అలాంటి పనే చేసారు.

ఇప్పటివరకు హిందీ, తెలుగు భాషలలో సోనూ నిగమ్ పాడిన పాటలు మంచి హిట్ సాధించాయి. అలాగే సోనూ నిగమ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అలాంటి సోనూ నిగమ్ రోడ్డు పక్కన పాటలు పాడుతూ బిచ్చమెత్తుకున్నాడట.

ముంబాయిలోని బాగా రద్దీగా వుండే ఓ ప్రాంతంలో సోనూ నిగమ్ వృద్దుడి వేషంలో, మాసిన జుట్టుతో, చేతిలో హార్మోనియం పెట్టేతో రోడ్డుపై కూర్చుని పాటలు పాడుకుంటూ కూర్చున్నాడట. సోనూ నిగమ్ తనదైన శైలిలో పాటలు పాడుకుంటూ వుంటే.. ఇతడిని జనాలెవరూ కూడా గుర్తించకపోగా.. ఇతని పాటలు నచ్చి వారికి తోచినంత చిల్లర ఇచ్చారట. అంతే కానీ పాడుతున్న వ్యక్తి సోనూ నిగమ్ అని ఎవరూ గుర్తించలేకపోయారట.

అయితే ఇదంతా సోనూ నిగమ్ ఎందుకు చేసాడంటే.... బీయింగ్ ఇండియా అనే డిజిటల్ ఛానెల్ సోషల్ ఎక్స్ పరిమెంట్స్ పేరుతో ఓ కార్యక్రమం రూపొందించారు. ఇందులో భాగంగా యాంత్రిక జీవనం నుంచి కాస్త సమయమైనా బయటకొచ్చి జనాలకు సంగీతం గొప్పతనాన్ని పరిచయం చేయడానికి ఇలా చేసినట్లుగా తెలిసింది.

అందువల్లనే సోనూ నిగమ్ రోడ్ సైడ్ ఉస్తాద్ పేరుతో ఇలా పాటలు పాడుకుంటూ సోను నిగమ్ బిచ్చమెత్తుకున్న వీడియోను విడుదల చేసారు. ఈ సంధర్భంగా సోనూ నిగమ్ మాట్లాడుతూ... తనను తాను గుర్తుపట్టలేకపోయేంత విధంగా అద్భుతంగా మేకప్ వేశారని.. బీయింగ్ ఇండియాలో భాగమవడం సంతోషంగా వుందని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonu Nigam  Songs Collections  Bollywood news  

Other Articles