Is Nayantara married..?

Shocking prefix mrs for nayantara

Shocking Prefix Mrs for Nayantara, Nayantara movies, Nayantara next movies, Nayanthara, Nayanathara, Diana Mariam Kurian, Kurian, Nayantara updates, Babu Bangaram, Vekatesh upcoming movie Babu Bangaram

Director Maruti has posted an picture of “Babu Bangaram” team on his social media networking site, which has raised some questions in the users mind.

దక్షిణాధి ప్రముఖ నటి నయనతార వివాహం చేసుకుందా..?

Posted: 05/15/2016 05:57 PM IST
Shocking prefix mrs for nayantara

దక్షిణ భారత చలనచిత్ర రంగంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతూ.. ప్రస్తుతం తన సహనటీమణుల కన్నా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ నయనతార.. తన అభిమానులను విస్మయానికి గురిచేసింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ చిత్రంతో పాటు వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబు బంగారం సినిమాల్లోనూ నటిస్తున్న ఈ టాప్ హీరోయిన్ కు సంబంధించిన ఒక అంశం అమె అభిమానులకు నిద్రను దూరం చేసింది. ముఖ్యంగా యువ అభిమానలోకం కలవరానికి గురవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. బాబుబంగారం యూనిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో అమె అభిమాన లోకంతో పాటు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం ఫారిన్లో ఉన్న యూనిట్ సభ్యులు హీరో హీరోయిన్లతో పాటు నిర్మాత నాగ వంశీ, దర్శకుడు మారుతిలు కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కుర్చీలలో కూర్చున్న ఈ నలుగురిని వెనకనుంచి తీసినట్టుగా ఉన్న ఈ ఫోటోలో నాగవంశీ చైర్ మీద ప్రొడ్యూసర్ అని, మారుతి చైర్ మీద డైరెక్టర్ అని, వెంకీ చైర్ మీద మిస్టర్ వెంకటేష్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది.

అయితే నయనతార కూర్చున చైర్ మీద మాత్రం మిసెస్ కురియన్ అని రాసి ఉంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువా డయానా మరియమ్ కురియన్ కాస్త నయనతారగా మారిన విషయం తెలిసిందే, కాగా నయనతార అసులు పేరును కుర్చీ వెనుక రాశారా.? అన్నది అసలు సమస్య కాదు. కానీ అమె పరుకు ముందు మిస్ బదులు మిసెస్ అని రాయటం చర్చనీయాంశంగా మారింది. నిజంగానే నయన్ పెళ్లి చేసుకుందా..? లేక బాబు బంగారం సినిమాలో వెంకీ, నయన్ లు తమ సొంతం పేర్లతోనే కనిపిస్తున్నారా..? లేక ప్రొడక్షన్ యూనిట్ తప్పిదం కారణంగా మిస్ ప్లేస్లో మిసెస్ అని రాశారా..? అసలు ఏం జరిగిందో తెలియక అభిమానులు షాక్ అవుతున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanathara  Venkatesh  maruthi  Kurian  Babu Bangaram  

Other Articles