అంతకుమించిన దండుపాళ్యం2 | Dandupalyam 2 Release in September

Dandupalyam 2 release in september

Dandupalyam 2 Release in September, Dandupalyam 2 stills, Dandupalyam 2 hot stills, Pooja Gandhi hot stills, Pooja Gandhi in Dandupalyam 2, Pooja Gandhi in Dandupalyam, Pooja Gandhi cleavage stills, Pooja Gandhi spicy stills

Dandupalyam 2 Release in September: Actress Pooja Gandhi upcoming film Dandupalyam 2. This film will be Release in September 2016.

అంతకుమించిన దండుపాళ్యం2

Posted: 05/13/2016 11:26 AM IST
Dandupalyam 2 release in september

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న ‘దండుపాళ్యం2’ చిత్రం 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత వెంకట్‌.

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ.... 40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. బెంగళూరు, బెల్గావ్‌లలో షూటింగ్‌ చేయడం జరిగింది. దండుపాళ్యం తర్వాత మరో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో చేస్తున్న ఈ సీక్వెల్‌లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది అన్నారు.

నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ.... బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చేయడం జరిగింది. మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను జూన్‌, జూలై నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dandupalyam2  Pooja Gandhi  Hot stills  

Other Articles