కేటీఆర్ మెచ్చిన కొత్త సినిమా? | Telangana Ministar KTR watched latest film

Telangana ministar ktr watched latest film

Telangana Ministar KTR watched latest film, KTR tweets on 24 film, KTR comments on 24, KTR comments on surya, Surya movie updates, Surya 24 film updates, Surya 24 collections

Telangana Ministar KTR watched latest film: Telangana Ministar KTR watched Suriya latest hit film 24.

కేటీఆర్ మెచ్చిన కొత్త సినిమా?

Posted: 05/11/2016 01:17 PM IST
Telangana ministar ktr watched latest film

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు రాజకీయాల గురించే కాకుండా తనకు సమయం కుదిరినప్పుడల్లా కూడా సినిమాలను కూడా వీక్షిస్తూ, మంచి సినిమాలపై తన స్పందనను తెలియజేస్తూ వుంటారు. అలాగే ఆ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రశంసిస్తుంటారు.

అలాంటి కేటీఆర్ గారు తాజాగా తమిళ నటుడు సూర్య నటించిన ‘24’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సినిమా ఇటీవలే తెలుగు, తమిళం భాషలలో విడుదలై సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అలాంటి ఈ సినిమాను కేటీఆర్ ఇటీవలే వీక్షించారు.

అనంతరం ఈ సినిమా గురించి కేటీఆర్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇప్పుడే 24 సినిమాను చూశాను. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన పర్ఫామెన్స్.. నా కూతురు, కొడుకు ఇప్పుడే 24 సినిమాను చూడాలన్నారు అని ట్వీట్ చేశారు. ఇక సూర్య ‘24’ అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Suriya  24 movie  Samantha  

Other Articles