అతనితో కుమారి రొమాన్స్ ఫిక్స్ | Habah Patel Romance with Mister

Habah patel romance with mister

Habah Patel Romance with Mister, Habah Patel rumors, Habah Patel replace regina, Habah Patel movie news, Habah Patel latest updates, Habah Patel stills, Habah Patel mister films, Habah Patel hot stills

Habah Patel Romance with Mister: Srinu Vaitla latest film Mister with Varun Tej. Lavanya Tripati and Hebah Patel Heroines.

అతనితో కుమారి రొమాన్స్ ఫిక్స్

Posted: 05/11/2016 11:08 AM IST
Habah patel romance with mister

‘కుమారి 21ఎఫ్’ సినిమాతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన యువ హీరోయిన్ హేభ పటేల్... తన సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటుంది. అన్ని సినిమాలను ఒప్పుకోకుండా తన కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటుంది. కుమారి తర్వాత హేభ నటించిన ‘ఈడోరకం ఆడోరకం’ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఈ అమ్మడు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.

ఇదిలా వుంటే ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా ‘మిస్టర్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో వరుణ్ సరసన లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా హేభ పటేల్ ను తీసుకొని, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి హేభను తప్పించినట్లుగా వార్తలొచ్చాయి.

వరుణ్ కు జోడిగా హేభ పటేల్ సరిపోదని, అందువల్లే రెజీనాను మరో హీరోయిన్ గా తీసుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఇందులో లావణ్య త్రిపాఠీతో హేభ పటేల్ మరో హీరోయిన్ గా నటిస్తుందని, ఈనెల 20న స్పెయిన్ లో ప్రారంభం కానున్న షూటింగ్ హేభ పటేల్ పాల్గొననుందని స్పష్టం చేసారు. మొత్తానికి ‘మిస్టర్’తో జోడికట్టేది ఈ కుమారి భామనే అని కన్ఫర్మ్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Habah Patel  Varun Tej  Mister  Lavanya Tripati  

Other Articles