ఫ్యాన్ పై ఆ హీరో బాడీగార్డ్ దాడి | Top hero bodyguard attacked on Fan.

Akshay kumar bollywood attack on fan akshay kumar said sorry

Akshay Kumar, Bollywood, Attack on fan, Akshay Kumar said Sorry, అక్షయ్ కుమార్, ముంబై

Bollywood top hero mr. Akshay Kumars Bodyguard attacked on Akshays fan in Mumbai Airport.

ఫ్యాన్ పై ఆ హీరో బాడీగార్డ్ దాడి

Posted: 04/30/2016 03:46 PM IST
Akshay kumar bollywood attack on fan akshay kumar said sorry

సినిమా స్టార్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏమిటో మన దగ్గర బాగా తెలుసు. తమకు నచ్చిన, మనం అభిమానించే యాక్టర్ మనకు కనిపిస్తే వచ్చే ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అప్పట్లో తమ అభిమాన యాక్టర్ కనిపిస్తే ఆటో గ్రాఫ్ అడిగే వాళ్లు కానీ ఇప్పుడు మాత్రం సెల్ఫీ అడుగుతున్నారు. అయితే తాజాగా ఓ హీరో అభిమాని.. ఎయిర్ పోర్ట్ లో తన హీరోతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యాక్టర్ బిజీగా ఉండటంతో అది కుదరలేదు.. కానీ యాక్టర్ బాలీగార్డ్ మాత్రం ఆ ఫ్యాన్ ను కొట్టాడు. ఇది తీవ్ర సంచలనంగా మారింది.

ఇంతకీ ఇదంతా ఎవరికి సంబందించినది అనుకుంటున్నారా..? బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ గురించి. తాజాగా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ క్షమాపణ చెప్పారు. ఇటీవల అక్షయ్‌కుమార్‌ అభిమానిపై ఆయన బాడీగార్డ్‌ చేయి చేసుకున్నాడు. ఈ ఘటనపై అక్షయ్‌ స్పందిస్తూ.. సదరు అభిమానికి ట్విట్టర్‌ వేదికగా క్షమాపణ తెలియజేశారు. అది అనుకోకుండా జరిగిన సంఘటన అని.. తన బాడీగార్డ్ అభిమానిపై చేయిచేసుకోవడం తాను గుర్తించలేదని.. అందుకే అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. జరిగిన విషయం తర్వాత తనకు తెలియడంతో.. తన బాడీగార్డును హెచ్చరించినట్లు తెలిపారు. జరిగిందేదైనా.. దానికి బాధ్యత వహిస్తూ క్షమాపణ చెబుతున్నానని.. మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకుంటానన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles