‘సరైనోడు’ రేటింగ్ చెప్పి టెన్షన్ లో పెట్టేసాడు | Umair Sandhu Sarrainodu Review

Umair sandhu sarrainodu review

Umair Sandhu Sarrainodu Review, Umair Sandhu Tweets on Sarrainodu, Sarrainodu Movie theaters list, Sarrainodu Movie in karnataka, Sarrainodu Movie promotions, అల్లు అర్జున్, సరైనోడు, రకూల్ ప్రీత్ సింగ్, Sarrainodu in banglore, Sarrainodu as Yodhuvu, Sarrainodu Trailers, Sarrainodu Movie Tickets, Sarrainodu Movie Online Bookings, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, ఫోటోలు, Sarrainodu Movie USA Theaters list, Sarrainodu Movie Posters, Sarrainodu Movie stills

Umair Sandhu Sarrainodu Review: Stylish star allu arjun latest film Sarrainodu will be release on 22 April. Boyapati Srinu Director, Thaman music, Rakul preet singh heroine.

‘సరైనోడు’ రేటింగ్ చెప్పి టెన్షన్ లో పెట్టేసాడు

Posted: 04/21/2016 07:04 PM IST
Umair sandhu sarrainodu review

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలకు ఒకరోజు ముందుగా యుకె దేశంలో ‘ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్’, ‘యుకె సెన్సార్ బోర్డ్ మెంబర్’, ‘ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ మిడిల్ ఈస్ట్ అండ్ యుకె’ అయినటువంటి ఉమైర్ సాంధు అనే వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా... ‘‘పైసా వసూల్ చిత్రమిది. చాలా నచ్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ పైసా వసూల్ మరియు విజిల్స్ వేసే చిత్రమిది. పవన్ కళ్యాణ్ మొత్తం షో అంతా దోచేసాడు. సింప్లీ వన్ మ్యాన్ షో ఇది. అద్భుతమైన నటన కనబరిచాడు. కాజల్ అగర్వాల్ సూపర్ బ్యాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. తను కూడా చాలా చక్కగా నటించింది. పవన్ కళ్యాణ్-కాజల్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. విలన్ పాత్రలో శరద్ కెల్కర్ నటన అద్భుతం. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ మైండ్ బ్లోయింగ్. అన్ని పాటలు సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ టెర్రిఫిక్. ప్రొడక్షన్ డిజైనింగ్ క్లాసీగా వుంది. సింపుల్ స్టోరీ, స్ర్కీన్ ప్లే, తక్కువ ఎడిటింగ్, చప్పట్లు కొట్టే విధంగా డైలాగ్స్, ఎముకలు విరిచే విధంగా యాక్షన్ సన్నివేశాలతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ అదిరిపోయింది. వెళ్లి తప్పక చూడండి’’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఉమైర్ సాంధు మాటలు నిజమేనని నమ్మి, ‘సర్దార్ గబ్బర్ సింగ్’పై మరిన్ని అంచనాలు పెట్టుకొని, మరుసటి రోజు సినిమాకు వెళితే నిరాశే మిగిలింది. పైగా సర్దార్ సినిమాకు ఉమైర్ సాంధు 5/5 రేటింగ్ ఇవ్వడం విశేషం. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం ‘సరైనోడు’ సినిమా విషయంలో మళ్లీ ఇలాంటి కామెంట్లే చేసాడు ఉమైర్ సాంధు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘సరైనోడు’ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాను ఒకరోజు ముందుగానే వీక్షించిన ఉమైర్ సాంధు... ఈ సినిమాపై భారీ స్థాయిలో పాజిటివ్ కామెంట్లు చేసాడు.

ఈ సినిమా గురించి ఉమైర్ సాంధు తెలియజేస్తూ.... అల్లు అర్జున్ కెరీర్ లోనే మరియు ఈ ఏడాదిలో బెస్ట్ చిత్రమిది. సంగీతం, యాక్షన్, కథ సూపర్బ్. పైసా వసూల్ చిత్రమిది. రకుల్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్. అల్లు అర్జున్ తో కెమిస్ట్రీ అదిరింది. అల్లు అర్జున్ కెరీర్లోనే ది బెస్ట్ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ చిత్రమిది అంటూ 4/5 రేటింగ్ ఇచ్చాడు.

ఉమైర్ సాంధు ఇచ్చిన రేటింగ్ చూసిన సోషల్ మీడియా జనాలు కంగారు పడుతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే ఉమైర్ సాంధు రివ్యూ మరియు రేటింగ్ చూసి బన్నీ ఫ్యాన్స్ బయపడుతున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా విషయంలో 5/5 రేటింగ్ ఇచ్చావు కానీ.. ఆ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ‘సరైనోడు’ సినిమాకు 4/5 రేటింగ్ ఇచ్చావు’ అంటూ భయపడుతున్నారు. మొత్తానికి ‘సరైనోడు’ సినిమా అభిమానుల్లో ఉమైర్ సాంధు పెద్ద ఉత్కంఠను నెలకొల్పాడు. మరి టాక్ ఎలా వుండబోతుందో మరికొద్ది గంటల్లో తెలయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarrainodu  Allu Arjun  Rakul Preeti Singh  

Other Articles