వివేక్ ఓబెరాయ్ తో వర్మ ‘రాయ్’ | Ram Gopal Varma Rai Film with Vivek Oberoi

Ram gopal varma rai film with vivek oberoi

Ram Gopal Varma Rai Film with Vivek Oberoi, RGV Rai film updates, RGV Rai with Vivek Oberoi, Ram Gopal Varma next film Rai, RGV Rai first look date, Rai film updates, RGV upcoming films

Ram Gopal Varma Rai Film with Vivek Oberoi: Ramgopal varma upcoming film with bollywood actor Vivek Oberoi. This film title Rai.

సుదీప్ ను కాదని వివేక్ ను తీసుకున్న వర్మ

Posted: 04/16/2016 06:09 PM IST
Ram gopal varma rai film with vivek oberoi

దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రారంభమయ్యి.. విడుదల కాకుండా ఆగిపోయిన చిత్రాల జాబితా బాగానే వుంది. ఆ సినిమాలను పూర్తి చేసి, విడుదల చేయకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు వర్మ. తాజాగా మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి ‘రాయ్’ అనే టైటిల్ ఖరారు చేసాడు వర్మ. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మే 1న నిర్వహించనున్నారు. ముందుగా ఈ పాత్రకోసం సుదీప్ ను అనుకున్నప్పటికీ... కొన్ని కారణాల వల్ల వివేక్ తీస్తున్నామని వర్మ చెప్పుకొచ్చారు.

డాన్ నుంచి కార్యకర్తగా మారిన ముత్తప్ప రాయ్ తన కోరిక మేరకు మే 1న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి అంగీకరించారని, ఆరోజున ఆయన పుట్టినరోజు అని తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ ను మంగళూర్, బెంగళూర్, ముంబాయి, దుబాయ్, లండన్లో జరుపనున్నారు. సీఆర్ మనోహర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషలలో ‘రాయ్’ చిత్రాన్ని తీస్తున్నట్లుగా వర్మ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Vivek Oberoi  Rai  

Other Articles