Actor Pruthvi | hero | Gova Raju Gari Pelli Sandadi | First look

Pruthvi turned as hero with gova raju gari pelli sandadi

Actor Pruthvi turned as hero, Actor Pruthvi as hero, Pruthvi in Gova Raju Gari Pelli Sandadi, Gova Raju Gari Pelli Sandadi First Look, Gova Raju Gari Pelli Sandadi Poster, Gova Raju Gari Pelli Sandadi Movie updates, Gova Raju Gari Pelli Sandadi launch date

Pruthvi turned as hero with Gova Raju Gari Pelli Sandadi: Tollywood Actor Pruthvi turned as hero with Gova Raju Gari Pelli Sandadi. This film first look poster released.

పెళ్లి చేసుకోబోతున్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ

Posted: 04/15/2016 01:31 PM IST
Pruthvi turned as hero with gova raju gari pelli sandadi

తెలుగు సినీ నటుడు పృధ్వీ అంటే ఎక్కువమందికి తెలియకపోవచ్చు కానీ.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ అంటే తెలుగు సినీ ప్రేక్షకులందరికి సుపరిచితుడే. అలాగే ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ అంటూ ‘లౌక్యం’ సినిమాలో తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ‘బెంగాల్ టైగర్’ సినిమాలో ‘ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప’గా అదరగొట్టేసాడు.

ఇలా వరుస హిట్ చిత్రాలలో నటిస్తూ, నటుడిగా మంచి పేరును తెచ్చుకున్న పృధ్వీ హీరోగా మారిపోయాడు. ఇప్పటివరకు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించిన పృధ్వీ హీరోగా మారాడు. పృధ్వీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోవా రాజు గారి పెళ్లి సందడి’. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.

ఇందులో పృధ్వీ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నిజమైన పెళ్లి ఆహ్వాన పత్రిక తరహాలో ఈ పోస్టర్ ను డిజైన్ చేసారు. ఈ చిత్ర ప్రారంభానికి ఈనెల 23న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉ.10 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles