Telangana Police Team | warns | tollywood films | Mental Police | Police

Police team angry on mental police team

Telangana Police Team warns to tollywood, Legal notice to Mental Police, Police movie release date, Dil raju police, Vijay Theri Police, Police movies, stills

Police Team Angry on Mental Police Team: Srikanth upcoming film Mental Police. Telangana Police Department warns to Mental Police Film Unit.

శ్రీకాంత్ ‘మెంటల్ పోలీస్’పై పోలీసుల ఆగ్రహం

Posted: 04/15/2016 10:11 AM IST
Police team angry on mental police team

ఈమధ్య తెలుగు సినిమాల్లో పోలీసు పాత్రలు చాలా ఎక్కువయ్యాయి. అలాగే పోలీస్ పదాలతో చాలా సినిమాల టైటిల్స్ వచ్చాయి. సినిమాల్లో పోలీసు పాత్రలను చులకనగా చిత్రీకరిస్తే పరువు నష్టం దావా, క్రిమినల్ కేసులు పెడతామంటూ పోలీసు అధికారుల సంఘం హెచ్చరించింది. సినిమాల్లో వచ్చే పోలీసుల పాత్రలపై వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

తాజాగా పోలీస్ అధికారుల సంఘం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో పరువు ప్రతిష్టలు కలిగిన పోలీసులను సినిమాల్లో చులకనగా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. సినిమాలో పోలీసు పాత్రధారులు చొక్కాలు విప్పడం, పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా పేర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఇక నుంచి తమను కించపరిచే పదాలు ఉపయోగిస్తే కేసులు పెడతామని స్పష్టం చేశారు.

సినిమాల టైటిల్ విషయంలోను, అలాగే పోలీస్ వాళ్లను పిలిచే పదాలను సరైన విధంగా ఉపయోగించాలని వారు తెలియజేసారు. ఖాకీలు, పోలీసోడు వంటి పదాలను ఉపయోగిస్తే సహించబోమన్నారు. ఇటీవలే శ్రీకాంత్ నటిస్తున్న ‘మెంటల్ పోలీస్’ చిత్ర టైటిల్ మార్చాలని లీగల్ నోటీసులు పంపినప్పటికీ.. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని, అందువల్ల వారిపై న్యాయస్థానంలో పోరాటం చేయడానికి సిద్ధమైనట్లుగా గోపిరెడ్డి చెప్పుకొచ్చారు.

ఇక ‘పోలీసోడు’ పేరుతో వస్తున్న సినిమాకు ‘పోలీస్’ అనే పేరుతో టైటిల్ మారుస్తున్నట్లుగా నిర్మాత దిల్ రాజు హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే తెలంగాణ పోలీస్ యూనిఫాం, లోగోలను ఉపయోగించి గౌరవించాలని కోరారు. మరి వీరు వాదనకు సినిమా ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు భవిష్యత్తులో ఏ విధంగా సినిమాలు తీస్తారో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Police Department  warning  tollywood  Mental police  Dil Raju police  

Other Articles