junior ntr to be the chief guest at kollywood hero vijay audio launch

Jr ntr coming for vijay s movie audio launch

janatha garage, jr ntr, policeodu audio, vijay, Theri, audio launch, Policeodu, Vijays Policeodu, Jr NTR, cheif guest, Policeodu audio launch, Theri Audio launch, Dil Rajucelebrities, movies, music

As per latest reports, NTR has been invited to launch the audio of ‘Policeodu’, the Telugu version of Vijay’s upcoming Tamil film ‘Theri’.

విజయ్ పోలీసోడు చిత్రం ఆడియో విడుదలకు ఛీఫ్ గెస్ట్ ఎన్టీయార్

Posted: 04/03/2016 12:06 PM IST
Jr ntr coming for vijay s movie audio launch

దాక్షిణాది హీరోలు తమ మార్కెట్ను పెంచుకోవడానికి అన్ని రకాలుగా శ్రమపడుతున్నారు. తమ బాషప్రయుక్త చిత్రాలతో పాటు ఇతర రాష్ట్రాల బాషల్లో కూడా విడుదలవుతున్న చిత్రాలకు మంచి మార్కెట్ రావడం కోసం కూడా కష్టపడుతున్నారు. అందుకే తమ సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయటమే కాదు. ఆ సినిమాల ప్రమోషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల ఆడియో రిలీజ్ను కూడా ఘనంగా నిర్వహిస్తూ స్టార్ హీరోలను ముఖ్య అతిథిలుగా ఆహ్వానిస్తున్నారు.

అదే బాటలో తమిళ హీరో విజయ్ తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. కోలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోగా ఉన్న విజయ్, చాలా కాలంగా తెలుగునాట స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్నాడు. సూర్య, విక్రమ్లతో పాటు కార్తీ లాంటి యంగ్ హీరోలు కూడా టాలీవుడ్లో హవా చూపిస్తుంటే విజయ్ మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా తేరిని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, తేరి సినిమాను తెలుగులో డబ్ చేసి, రిలీజ్ చేస్తున్నాడు. తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ప్రమోషన్ కూడా మొదలుపెట్టారు. ఇక ఆడియో రిలీజ్ను కూడా భారీగా ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ను ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావిస్తోంది. విజయ్, సమంతలతో పాటు ఎన్టీఆర్ కూడా ఈ ఆడియో వేడకలో పాల్గొంటే సినిమాకు మరింత ప్రచారం లభిస్తుందని దిల్రాజు ప్లాన్.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Vijay  Theri  Dil raju  Polisodu  

Other Articles