Nara Rohit | Savitri | Release Date | Trailers | Stills

Savitri release on 1 april

Savitri Release Date Confirmed, Savitri Movie Posters, Savitri Movie Trailers, Nara Rohit Savitri movie news, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri movie details, Nara Rohit Savitri launch date, Nara Rohit latest news, Nara Rohit movie updates, Nara Rohit

Savitri Release on 1 April: Nara Rohit's Savitri teaser. directed by Pawan Sdhineni. produced by B. Rajendra Prasad. music by Sravan. Nandita heroine.

ఏప్రిల్ 1న ‘సావిత్రి’ విడుదల

Posted: 03/17/2016 11:54 AM IST
Savitri release on 1 april

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై డా.వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాతగా నారారోహిత్ -నందిత కాంబినేషన్ లో వస్తున్నా ‘సావిత్రి’. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.....

నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘’ ఇది ఒక క్యూట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన రోజు నుండి ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమా మొత్తం పూర్తయింది. నారా రోహిత్, నందిత ల కాంబినేషన్ ఈ చిత్రానికి ఎంతో ప్లస్ అవుతుంది. ప్రేమ ఇష్క్ కాదల్ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల శ్రవణ్ అందించిన పాటలు విడుదలయ్యాయి. పాటలకు ఆడియెన్స్ ను మంచి స్పందన వస్తుంది. రోహిత్ బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

నటీనటులు : నారా రోహిత్, నందిత, పోసాని కృష్ణ మురళి, మురళి శర్మ, అజయ్, రవి బాబు, జీవా, వెన్నెల కిషోర్, శ్రీముఖి , ధన్య బాలకృష్ణన్, మధు నందన్, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను షకలక శంకర్ తదితరులు. సాంకేతిక విభాగం : సినిమాటోగ్రఫీ - వస్సంత్ , డైలాగ్స్ - కృష్ణ చైతన్య, సంగీతం - శ్రవణ్ , ఎడిటర్ - గౌతం నెరుసు, ఆర్ట్ డైరెక్టర్: హరి వర్మ, ఫైట్స్ - డ్రాగన్ ప్రకాష్, కో డైరెక్టర్: సురేష్, ఎగ్జిక్యుటివ్ ప్రొడ్యూసర్ - జాబిల్లి నాగేశ్వర రావు, నిర్మాత - డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం - పవన్ సాదినేని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Savitri  Release Date  Trailer  Nandita  Movie News  

Other Articles