Tollywood stars shine in White & White at “Sensation”

Bunny on shoulders of me tweets rana

rana daggubati, allu arjun, nagarjuna, amala, manchu laxmi, sensation, dance and music event, twitter, white and white.

Good friends Rana Daggubati and Allu Arjun had blast at 'Sensation' event at Gachibowli Stadium held last night in Hyderabad.

టాలీవుడ్ కండలవీరుడి భుజాలపై స్టైలిష్ స్టార్..

Posted: 03/07/2016 07:38 AM IST
Bunny on shoulders of me tweets rana

టాలీవుడ్ కండలవీరుడు, సినీ నటుడు రానా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో ఇది సోషల్ మీడియాలో సినీ అభిమానుల షేర్లతో హల్ చల్ చేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలసి, గత రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో 'సెన్సేషన్ సంగీతఝరి' పాల్గొన్నారు.  దీనికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు ధీమ్ 'వైట్ అండ్ వైట్' ను ఎంచుకున్నారు. అంటే ఇందులో పాల్గొనేవారంతా తెల్లని దుస్తులు ధరించాల్సి ఉంటుంది.

ఇక ఈ షోలో సెలబ్రిటీలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్లో ఎంజాయ్ చేస్తున్న సూపర్ ఫొటోను రానా తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను టాలీవుడ్, బాలీవుడ్ టార్జాన్ రానా తన భుజాలపై ఎక్కించుకున్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన రానా, డానికి 'వాట్ ఏ షో... గైస్' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సినీ అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. దీనికి లైకులు, కామెంట్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Twitter  Rana  Bunny  Sensation  ALlu arjun  Gachibowli  

Other Articles