Kshanam | Bollywood remake | Collections | reviews

Kshanam remake into bollywood

Kshanam film remake, Kshanam remake into bollywood, Kshanam collections, Kshanam movie updates, Kshanam stills, Kshanam

Kshanam remake into bollywood: Adavi sesh, adah sharma, anasuya, satyam rajesh acts in lead roles. pvp producer, ravikanth perepu director.

బాలీవుడ్ లోకి రీమేక్ కానున్న ‘క్షణం’

Posted: 03/01/2016 06:49 PM IST
Kshanam remake into bollywood

తెలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘క్షణం’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ, సత్యం రాజేష్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో కొనసాగుతుంది. కేవలం కోటి రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్ల మోత మోగిస్తోంది.

ఈ సినిమా విడుదలైన ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. పర్ఫెక్ట్ కథ, కథనంతో, ట్విస్టులతో.. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు సస్పెన్స్ తో ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి పలు హిందీ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ ఈ సినిమాను పివిపి సంస్థ స్వయంగా బాలీవుడ్ రీమేక్ చేయాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. బాలీవుడ్ రీమేక్ ను అడవి శేష్ హీరోగా, రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించనున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kshanam  Remake  collections  anasuya  stills  

Other Articles