సునీల్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘కృష్ణాష్టమి’. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని చాలా రోజుల క్రితమే పూర్తి చేసారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కథలో కొత్తదనం లేకపోయినా ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన కుర్రాడు ఇండియాలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడో చెప్పే స్ట్రయిట్ సినిమా. ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు , టర్నింగ్ లు ఉండవు. అయితే ఈ సినిమాలో కామెడీ మాత్రం పుష్కలంగా ఉంటుందంట. బ్రహ్మీ సెల్ఫీ బర్ఫీగా బాగా నవ్విస్తాడని చెబుతున్నారు అందరూ.
అలాగే , ఎమోషన్ సీన్స్ లో సునీల్ పెర్ఫామెన్స్ చాలా బాగుందనేది టాక్. ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా సునీల్ కి రీబ్యాక్ మూవీ అవుతుందని దర్శకుడు వాసు వర్మ చాలా ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో , ఉన్నతమైన సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించింది. ఈ సినిమాలో సునీల్ సరసన , నిక్కీ గర్లానీ , డింపుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more