Supreme | Allu Sirish | Sai Dharam Tej | Teaser | Stills

Allu sirish in sai dharam tej supreme film

Allu Sirish in Sai Dharam Tej Supreme, Allu Sirish in Supreme, Sai Dharam Tej Supreme movie, Supreme movie teaser, Supreme movie stills, Supreme movie posters, Supreme teaser

Allu Sirish in Sai Dharam Tej Supreme Film: Saidharam Tej upcoming film Supreme. Anil Ravipudi director. Rashi khanna heroine.

సుప్రీం సినిమాలో మెగా హీరో

Posted: 02/11/2016 03:41 PM IST
Allu sirish in sai dharam tej supreme film

మెగా హీరోలు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో చూస్తున్నారు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రాంచరణ్, బన్నీ, సాయిధరమ్ తేజల కాంబినేషన్లను ఇప్పటికే చూసేసారు. ఇటీవలే ‘ఎవడు’ సినిమాలో బన్నీ-చెర్రీల కాంబినేషన్ తో మరోసారి మెగా ఫ్యామిలీ యువ హీరోల్లో నూతనుత్సాహం చోటు చేసుకుంది.

అయితే తాజాగా మరో మెగా కాంబినేషన్ సిద్ధం కానుందని తెలిసింది. సాయిధరమ్ తేజ(తేజు) హీరోగా ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీం’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర కోసం అల్లు శిరీష్ ను సంప్రాదించారు. పాత్ర చిన్నదే అయినప్పటికీ.. కథకు కీలకం కావటంతో శిరీష్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

త్వరలోనే శిరీష్, తేజుల కాంబినేషన్ సీన్లను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme  Allu Sirish  Sai Dharam Tej  Teaser  Stills  

Other Articles