Balakrishna | interview | Funny Train Scene | Dictator

Balakrishna comments on his funny train scene

Balakrishna talks about his Funny Train Scene, Balakrishna comments on Funny Train Scene, Balakrishna interview on Funny Train Scene, Balakrishna latest interview, Balakrishna latest comments, Balakrishna funny talk, Balakrishna

Balakrishna comments on his Funny Train Scene: Nandamuri Balakrishna previous film Palnati Brahmamnaidu. In this film funny train scene.

ట్రైన్ సీన్ ఎందుకు చేసానో ఇప్పటికీ తెలియదు: బాలయ్య

Posted: 01/23/2016 11:38 AM IST
Balakrishna comments on his funny train scene

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలున్నప్పటికీ.. బాలయ్యకు వున్నంత క్రేజ్ ఎవరికీ లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది అగ్ర, స్టార్ హీరోలు సైతం బహిరంగంగా ఒప్పుకున్నారు. తమ సినిమాల్లో ఎంత కమర్షియల్ మాస్ పాత్రలు చేసిన ఒక్కోసారి జనాలు ఒప్పుకోరు. కానీ బాలయ్య లాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరో తొడగొట్టి, స్టాప్ అని చెబితే వచ్చే ట్రైన్ సైతం ఆగిపోవాల్సిందేనని, అలాంటి సీన్లను బాలయ్య మాత్రమే చేయగలడని, అలా చేసి, ప్రేక్షకులను మెప్పించగల సత్తా బాలయ్యకు మాత్రమే వుందంటూ గతంలో అక్కినేని నాగార్జున ప్రకటించాడు.

ఇతర నటీనటులు విషయంలో పాజిటివ్ గా కామెంట్లు మంచి పరిణామమే కానీ.. తన తప్పును కూడా తెలుసుకొని, ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించినవారే నిజంగా ప్రజల గుండెల్లో నిలిచే నిజమైన హీరో. అలాంటి హీరోగా మరోసారి బాలయ్య నిరూపించుకున్నారు. ఇటీవలే ‘డిక్టేటర్’ సినిమాతో 99 సినిమాలను పూర్తి చేసుకున్న బాలయ్య.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు టీవి ఛానెల్లతో మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

Balakrishna talks about his Funny Train Scene

ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఓ మీడియాతో బాలయ్య మాట్లాడుతూ... ‘పల్నాటి బ్రహ్మన్నాయుడు’ సినిమాలో పో అని అనగానే ట్రైన్ వెళ్లిపోతుంది. ఎంటి ఇలా అంటే ట్రైన్ వెళ్లిపోవడమేంటని అప్పుడప్పుడు నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది. షూటింగ్ సమయంలో ఏం అనిపించదు కానీ.. ఆ తర్వాత ఓ పదిమంది అన్న తర్వాత చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో రైటర్స్ ఎందుకు అలా రాసారో, నేనెందుకు ఒప్పుకున్నానో తెలియదు. అలా జరిగిపోయింది అంతే అని బాలయ్య చెప్పుకొచ్చాడు.

ఇక త్వరలోనే దర్శకత్వం కూడా చేయాలని బాలయ్య ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ... మాములు కమర్షియల్ సినిమాలు చేయలేను. నాకు పౌరణీకాలు, మెగా, లెజెండ్రీ ప్రాజెక్టులు మాత్రమే చేయగలను. దర్శకుడిగా ‘పెద్దన్నయ్య’ సినిమాతో ఆ కోరిక కాస్త తీరింది. ఆ సినిమా క్లైమాక్స్ మొత్తం నేనే డైరెక్ట్ చేసాను. క్లైమాక్స్ కోసం 100 రోజుల ఆడింది ఆ సినిమా అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Interviews  Funny Train Scene  Movie News  Stills  

Other Articles