Gunasekhar gets KV Reddy award

Gunasekhar gets kv reddy award

Gunasekhar to be honoured with KV Reddy award, Gunasekhar KV Reddy award, Gunasekhar awards, Gunasekhar latest news, Gunasekhar KV Reddy news, Gunasekhar latest updates, Gunasekhar movies, Gunasekhar stills

Gunasekhar gets KV Reddy award: Tollywood director Gunasekhar received KV Reddy Award 2015 for his contriution to Telugu Cinema.

దర్శకుడు గుణశేఖర్ కు కె.వి.రెడ్డి అవార్డు

Posted: 12/14/2015 10:07 AM IST
Gunasekhar gets kv reddy award

ప్రముఖ దర్శకుడు కె.వి.రెడ్డి పేరుతో యువ కళావాహిని అందజేస్తున్న అవార్డును ఈ ఏడాది తెలుగు చలన చిత్ర దర్శకుడు గుణశేఖర్ కు అందజేసారు. ఈ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. గుణశేఖర్ ను దాసరి శాలువాతో సత్కరించి, అవార్డును అందజేసారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కిరీటాన్ని అందించారు.

ఈ సంధర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ... కె.వి.రెడ్డి గారి పేరుతో వున్న అవార్డు నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దాసరి గారి పేరుపైన కూడా ఒక అవార్డు పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాసరిగారి టచ్ చేయని జోనర్ సినిమాలు లేవు. ఆయన తీసిన సినిమాలనే ఇప్పటి దర్శకులు ఫాలో అవుతున్నారు. ఈ కె.వి.రెడ్డి గారి అవార్డుతో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే బాధ్యత పెరిగింది అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అశ్వనీదత్, మణిశర్మ, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని గుణశేఖర్ ను అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gunasekhar  KV Reddy award  Latest News  Stills  

Other Articles