Naga shourya play brother role in Jo Achyutananda

Naga shourya play brother role in jo achyutananda

Naga shourya to play brother role in Jo Achyutananda, Naga shourya in Jo Achyutananda, Jo Achyutananda movie news, Jo Achyutananda posters, Jo Achyutananda stills, Jo Achyutananda movie updates, Jo Achyutananda, Naga shourya, Nara Rohit

Naga shourya play brother role in Jo Achyutananda: Director srinivas avasarala next film Jo Achyutananda. Nara Rohit acts in lead role. Naga shourya to play brother role in this film.

అన్నదమ్ములుగా మారనున్న యువహీరోలు

Posted: 11/21/2015 09:45 AM IST
Naga shourya play brother role in jo achyutananda

‘అష్టాచెమ్మా’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జ్యో అచ్చుతానంద’. ఇందులో నారా రోహితో హీరోగా నటించనున్నాడు.

అయితే తాజాగా ఈ సినిమాలో యువ హీరో నాగశౌర్య కూడా చేరనున్నట్లుగా తెలిసింది. ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్ కు, హీరోగా నాగశౌర్యకు మంచి బ్రేక్ లభించింది. అందువల్ల ఈ సినిమా కోసం దర్శకుడు అడగగానే నాగశౌర్య వెంటనే అంగీకరించారు.

ఇందులో నారా రోహిత్ కు తమ్ముడి పాత్రలో నాగశౌర్య నటించనున్నాడు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించనున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles