if this is going to be difficult to come up with

Trisha reveals comments on her entry into industry

Trisha, Trisha nayaki, nayaki shooting, Trisha hot, Trisha films, Trisha photos, Trisha gallaries, Trisha updates, Trisha latest movies, Trisha upcomming movies, Trisha forth comming movies, Trisha in kamal hassan movie

south indian actress Trisha reveals comments on her entry into industry, some were takling about her size zero

అలా చేస్తూనే ఎదిగానంటున్న అమ్మడు త్రిష

Posted: 11/15/2015 06:32 PM IST
Trisha reveals comments on her entry into industry

సైజ్ జీరో వున్న వాళ్లకు ఇప్పుడు సినిమా ఇండస్రీలో క్రెజ్ వచ్చింది కానీ అంతకు ఓ పది పదిహేనేళ్ల క్రితం మరీ సన్నగా వున్నా పనికిరాదనేవాళ్లట. కాస్తో, కూస్తో కండపట్టి వుంటేనే రాణించగలరన్న నమ్మకం వుండేది అప్పటి సినీ నిర్మాత, దర్శకులకు. అయితే అలాంటి సమయంలోనే తమిళ, తెలుగు సినీరంగాల్లోకి ప్రవేశించిన అందాల బామ త్రిష మాత్రం.. ఎవరు ఏమైనా చెప్పినా.. తాను మాత్రం తాను అనుకున్నదే చేయాలనుకుని నిశ్చయించుకుందట. అలా తన నిర్ణయాలు తాను స్వతంత్రంగా తీసుకోవడం వల్లే తాను సినీ పరిశ్రమలో బాగా రాణించానని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని మరీ చెబుతొంది ఈ అమ్మడు.

మోడల్‌గా చేసినవాళ్లు కథానాయికలుగా అస్సలు పనికి రారని తాను హీరోయిన్ గా రంగప్రవేశం చేసినప్పుడు వినబడిన కామెంట్స్ నుంచి త్రిష మన అమ్మాయే అనే స్థాయికి మార్చుకున్నానని చెప్పింది. తాను కథానాయిక అయిన కొత్తలో కాలీవుడ్ లో తమిళ అమ్మాయిలు పెద్దగా లేరు. బాలీవుడ్ కథానాయికల హవా సాగుతుండేది. అందుకేనేమో ‘మన అమ్మాయి’ అంటూ తమిళ మీడియా నన్ను బాగానే ఎంకరేజ్ చేసింది. తెలుగువాళ్లు కూడా తమ అమ్మాయిలానే భావించారు. మీడియాపరంగా నాకు చాలా సపోర్ట్ లభించింది.

కానీ, మీడియాకి సంబంధం లేని వ్యక్తులు కొంతమంది, ‘మోడలింగ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్లు హీరోయిన్లుగా పైకి రావడం కష్టం. పైగా, మీరు మరీ సన్నగా ఉన్నారు. ఇంకాస్త లావైతే బాగుంటుంది’ అన్నారు. ఆ మాటలను నేను పట్టించుకోలేదు. నన్ను నేను మార్చుకోను అని కరాఖండీగా అన్నాను. చివరకు వాళ్ల మాటలను అబద్ధం చేయగలిగాను.  నేను ఆ మాటలను పట్టించుకుని ఉంటే ఆత్మవిశ్వాసం కోల్పోయి ఉండేదాన్నేమో. అందుకే అంటున్నా... విమర్శలను పట్టించుకోకూడదు. మనం చేయాలనుకున్న పనిని నిజాయతీగా చేసుకుని వెళ్లిపోవడమే. అప్పుడే మన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా దక్కుతుంది’’ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Modeling  Heroine  size zero  kollywood  

Other Articles