rakul preet singh following tamanna bhatia in dance course | tollywood gossips | telugu heroines

Rakul preet singh following tamanna bhatia tollywood gossips telugu heroines

rakul preet singh news, rakul preet singh gossips, rakul preet singh hot photo shoot, rakul preet singh telugu movies, tamanna bhatia news, tamanna bhatia hot photo shoot

rakul preet singh following tamanna bhatia tollywood gossips telugu heroines : rakul preet singh following tamanna bhatia in dance course to prove herself best co-actress for charan, ntr and allu arjun.

తమన్నాను కాపీ కొడుతున్న రకుల్ ప్రీత్

Posted: 10/26/2015 04:57 PM IST
Rakul preet singh following tamanna bhatia tollywood gossips telugu heroines

ఇండియన్ ఇండస్ట్రీలో వున్న హీరోయిన్లందరిలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా రూటే వేరు. కాలేజీ రోజుల్లోనే ముఖానికి మేకప్ వేసుకుని కెమెరాముందుకొచ్చిన ఈ బ్యూటీఫుల్ అమ్మడు.. చాలా జాగ్రత్తగా అడుగులేస్తూ తన కెరీర్ ని బిల్డ్ చేసుకోగలిగింది. చిన్న హీరోలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. తన ప్రతిభతో అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికీ ‘స్టార్’ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక డిమాండ్ ని ఏర్పరుచుకుంది. ఈ విధంగా ఎదిగిన తమన్నా బాటలోనే రకుల్ ప్రీత్ ప్రయాణం చేస్తోందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతూ స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు.. ఒక్క విషయంలో మాత్రం తమన్నాను ఫాలో అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ ఒక్క విషయం ఏంటి? అని తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

తమన్నా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మొదట్లో గ్లామర్, యాక్టింగ్ పరంగా బాగానే మార్కులు సంపాదించింది. కానీ.. డాన్స్ విషయంలో మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది. ముఖ్యంగా డాన్సులతో ప్రేక్షకుల్ని అలరించడంలో తమకు తామే సాటిగా నిరూపించుకున్న ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ వంటి కథానాయకుల సరసన నటించే ఛాన్సులు వచ్చినప్పుడు.. వారితో సమానంగా డాన్స్ చేయడంలో ఈమెకు కష్టతరంగా మారింది. అప్పుడు తన డాన్స్ కాస్త వీక్ గా వుందని గుర్తించిన తమన్నా.. దానిపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని పసిగట్టగలిగింది. వెంటనే డాన్స్ క్లాసులకు జాయిన్ అయి, తనను తాను బాగా ఇంప్రూవ్ చేసుకుంది. కొన్నాళ్లు బాగా సాధన చేసి శభాష్ అనిపించుకుంది. ఈ విధంగా రకుల్ ప్రీత్ కూడా ప్రయాణం చేస్తోందని సమాచారం. గ్లామర్, యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన రకుల్.. ఆ ముగ్గురు స్టార్ హీరోలతో సమానంగా స్టెప్పులేయడం కష్టమని భావించి, ఆ విభాగంలో బాగా ఇంప్రూవ్ చేసుకుందట. ఇప్పటికే చరణ్ సరసన ‘బ్రూస్ లీ’లో నటించిన అతనిలాగే స్టెప్పులేసిన అమ్మడు.. ఎన్టీఆర్ తోను ఆ తరహాలోనే స్టెప్పులేసిందట. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి డాన్సులు వేస్తోంది.

ఆ ముగ్గురు స్టార్ హీరోలకు జోడీగా బెస్ట్ అనిపించుకోవడం కోసం రకుల్ డాన్సుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని అంటున్నారు. ఈ దెబ్బతో తన ఇమేజ్ టాలీవుడ్ లో మరింత పెరిగిపోతుందనే ఆశతో అమ్మడు చాలా కష్టపడుతోందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. డాన్స్ విషయంలో తమన్నా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటే.. ఆ తర్వాత రెండో స్థానం రకుల్ ప్రీత్ సింగ్ దేనని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఏదేమైనా.. ఈ అమ్మడు దూకుడు చూస్తుంటే.. మరో ఐదేళ్ల వరకు టాలీవుడ్ ని తన ఒంపుసొంపులతో ఊపేస్తుందని అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh  tamanna bhatia  allu arjun  

Other Articles