venkatesh playing guest role for nephew nagachaitanya

Venkatesh guest role in nagachaithanya majnu

victory venkatesh,venkatesh, venkatesh latest news, venkatesh akkineni nagachaitanya movie, venkatesh photos, venkatesh movie collections, venkatesh nagachaitanya majnu movie, venkatesh latest updates, venkatesh movie news, venkatesh cinema News, venkatesh upcomming movies, venkatesh new look, venkatesh guest role

tollywood hero victory venkatesh is ready for touch up in a guest role for his nephew akkineni nagachaitanya movie premam

మేనల్లుడి కోసం.. అతిథిగా మారుతున్న విక్టరీ

Posted: 10/04/2015 09:03 PM IST
Venkatesh guest role in nagachaithanya majnu

సినిమా ఇండస్ట్రీలో అగ్రకథానాయకులతో బంధాలు, బంధుత్వాలు వున్నయంగ్ హీరోల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో అగ్రకథానాయకులు కూడా తమవారి కోసం కాస్తో.. కూస్తో వారి చిత్రాల్లో కనిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బ్రూస్ లీ చిత్రంలో చిరంజీవి మాదిరిగానే అతిథి ప్రాతలో నటించడానికి తాజాగా విక్టరీ వెంకటేష్ కూడా మొగ్గుచూసుతున్నారు. గోపాల గోపాల' సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే ఓ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మారుతి, క్రాంతి మాధవ్ లాంటి దర్శకుల చెప్పిన కథలకు ఓకె చెప్పిన వెంకీ, ఎవరు ముందుగా కథ రెడీ చేస్తే వారితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అయితే ఈ గ్యాప్లో నాగచైతన్య చేస్తున్న సినిమాలో అతిథి పాత్రలో నటించనున్నాడు వెంకీ.

ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలో నటిస్తున్న చైతూ ఆ సినిమా పూర్తవ్వగానే మళయాల సూపర్ హిట్ సినిమా 'ప్రేమమ్' రీమేక్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి సీనియర్ స్టార్ వెంకటేష్ అంగీకరించాడు. తన మేనల్లుడు నాగచైతన్య స్వయంగా అడగటంతో ఈ క్యారెక్టర్ చేయడానికి వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడు. ఒరిజినల్ వర్షన్లో అనంత్ నాగ్ నటించిన పాత్రలో తెలుగులో వెంకీ దర్శనమివ్వనున్నాడు. 'కార్తీకేయ' ఫేం చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్, దిశాపటానీ, అనుపమా పరమేశ్వరన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రేమమ్ తెలుగు రీమేక్కు మజ్ను అనే టైటిల్ను ఫైనల్ చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkatesh  nagachaithanya  Majnu  Premam  

Other Articles